Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప‌వ‌న్ ,అలీ మాట‌ల వెనుక మ‌ర్మం ఏమిటి ...?

Category : state politics

ప‌వ‌న్ పార్టీ పెట్టి చాలా కాలం అయినా ..సినిమాల‌కు పుల్ స్టాప్ పెట్టి రాజ‌కీయాల‌లోకి అడుగుపెట్ట‌డం గ‌త కొన్ని నెల‌ల క్రితం జ‌రిగింది .అయితే ఈ రాజ‌కీయ‌ల‌లో ప‌వ‌న్ త‌నకు సంబంధించిన సినిమా వాళ్ల‌ను ఎవ‌రిని, పార్టీలోకి ఆహ్వానించ‌లేదు...కానీ వారు అంద‌రు ప‌వ‌న్ కు ఎప్పుడు అండ‌గా ఉంటామ‌ని చెప్పుకొచ్చారు.అలీ కూడా పార్టీ స్తాపించ‌పించిన మొద‌ట్లో ప‌వ‌న్ తో స‌న్నిహితంగానే ఉన్నారు. దాంతో అంద‌రు అలీ ప‌వ‌న్ పార్టీలో చేర‌తార‌ని అంద‌రు భావించారు.కానీ ..అలీ అంద‌రికి షాక్ ఇస్తూ వైసీపీ పార్టీలో చేరిపోయారు.

అయితే అలీ ,ప‌వ‌న్ ల మ‌ధ్య విమ‌ర్శ‌లు అనేవి ఎప్పుడు రాలేదు..దాంతో అంద‌రు వాళ్ల మ‌ధ్య రిలేష‌న్ గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశారు.కానీ తాజాగా అలీ నాకు న‌మ్మ‌క‌ద్రోహం చేశార‌ని, చాలా స‌మ‌యాల‌లో అత‌నిని ఆదుకున్నాని ,అత‌ని బంధువుకు టికెట్ ఇచ్చాన‌ని,కానీ అలీ మాత్రం వేరే పార్టీలో చేరార‌ని ,ఇక నుండి అలీని నేను న‌మ్మ‌న‌ని రాజ‌మండ్రి జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో చెప్పారు.మ‌ధ్య‌మాల ద్వారా ఈ విష‌యం తెలుసుకున్న అలీ...తాను మాట్లాడిన ఒక విడియోను పోస్ట్ చేశారు.ఆ విడియోలో అలీ మాట్లాడుతూ ..ప‌వ‌న్ నేను చాలా న‌మ్మాన‌ని ,అయ‌న ఎప్ప‌టికి నా గుండెలో ఉంటార‌ని చెప్పిన అలీ ,అయ‌న అలా విమ‌ర్శ‌లు చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అన్నారు.ప‌వ‌న్ ను ఇప్ప‌టి వ‌రకు నేను ఎక్క‌డా విమ‌ర్శించ‌లేద‌ని , కానీ ...ఆయ‌న నా సొంత ఊరు రాజ‌మండ్రికి వ‌చ్చి అలా అన‌డం వ‌ల్లే నేను ఇలా చేయాల్సి వ‌స్తుందంటూ చెప్పుతూ ...నాకు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఎలాంటి స‌హాయం చేయ‌లేద‌ని, అడుకునే స్థీతికి నేనేప్పుడు చేర‌లేద‌ని ,ఒక వేళ అలాంటి ప‌రిస్థితి వ‌స్తే చావ‌నైనా చ‌స్తాను కానీ..దేహి అంటూ యాచించ‌ను అని అన్నారు...

అయితే ఇన్ని రోజులు లేని విమ‌ర్శ‌లు, ఇప్పుడే చేయాల్సిన ప‌రిస్థితి ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌ని చాలా మంది భావిస్తున్నారు.అయితే ఇక్క‌డ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విష‌యం ఏంటంటే ..ఈ మ‌ధ్య ప‌వ‌న్ వ‌డ దెబ్బ కార‌ణంగా డీహైడ్రేష‌న్ కు లోనైయ్యారు ..ఈ స‌మ‌యంలో చాలా మంది ప‌వ‌న్ ప‌రామ‌ర్శించారు.కానీ ...అలీ మాత్రం వెళ్ల లేదు.దీంతో ప‌వ‌న్, అలీ మీద కొంత అస‌హ‌నంతో ఉన్న‌ట్లు కొన్ని వ‌ర్గాల నుండి అందుతున్న‌ స‌మాచారం ... అందుకే ప‌వ‌న్ అలీ పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు.కానీ ..అలీ కి చెప్ప‌కుండా అత‌ని బంధువుకు టికెట్ ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అంటూ అలీ అనుకూల వ‌ర్గాల వాద‌న‌...అయితే ఏది ఏమైనా కానీ రాజ‌కీయాల‌లో ఇలాంటివి కామ‌న్ అయినా..వాళ్లు ఇద్ద‌రు ఒకే సినిమా ప్ర‌పంచంనుండి వ‌చ్చార‌ని గుర్తుపెట్టుకుంటే రాజ‌కీయాల‌కు ,ప‌ర్స‌న‌ల్ కు తేడా తెలిసేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Related News