Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశ రాజకీయాలలో ఓవైసీతో కేసీఆర్ ప్లాన్ వెనుక రీజన్ అదేనా

Category : politics state

కేసీఆర్ చరిష్మా ను నిజం చేస్తూ టీఆర్ ఎస్ పాలనను సమర్ధిస్తూ ముందస్తు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. భారీ మెజారిటీతో గెలుస్తామని ముందుగా చెప్పినప్పటికీ.. చివరి క్షణంలో ఆయన కాస్త మహాకూటమి వల్ల కాస్త ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో చాలా చిరాకును ప్రదర్శించారు. రాజకీయ సమీకరణాలు ఏ క్షణం ఎలా మారతాయో అని అయోమయానికి గురయ్యారు.

కానీ కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేశాడనే గౌరవభావంతో తెలంగాణా ప్రజలు సెంటిమెంట్ తో మళ్ళీ మరోసారి కేసీఆర్‌కే పట్టం కట్టారు. దీంతో ఇక కేసీఆర్ జోరు చూపిస్తున్నాడు. దేశరాజకీయాల్లో చక్రం తిప్పేంత కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. దీంతో ఆయనలో ఎక్కడా లేని జోష్ వచ్చేసింది. బీజేపీ యేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని దేశంలో తీసుకొస్తానని మొదటి మీడియా సమావేశంలోనే చెప్పిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు మజ్లీస్ పార్టీ సహకారం తీసుకుంటున్నారు. మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ తో కలిసి దేశం అంతా తిరగాలని ఫెడరల్ ఫ్రంట్ కు పలు ప్రాంతీయ నేతలతో మాట్లాడి మద్దతు తీసుకోవాలని కేసీఆర్ ప్లాన్ లో ఉన్నారు. అందుకోసం కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీతో చర్చలు జరుపుతున్నారు. ఒక్క తెలంగాణాలో గెలిచినంత మాత్రాన దేశంలో గెలవటం అంటే అంత సులువైన విషయం కాదు. కనీ వ్యూహాత్మకంగానే ఆ దిశగా పావులు కదిపే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్ .

ఇక దేశ రాజకీయాల్లో ఏమి చెయ్యాలి అనేదానిపై రాజకీయాల్లో చాలా దెబ్బలు తిని వచ్చిన నాయకుడు కాబట్టి ఆ మాత్రం అంచనా ఉండే వుంటుంది. ఇక ముస్లిం ఓటు బ్యాంకు టార్గెట్ గా ఓవైసీతో కలిసి వ్యూహం రచిస్తున్నారు అంటే చాలా పెద్ద ప్లాన్ వుండే వుంటుంది అని రాజకీయ విశ్లేషకుల భావన . కేసీఆర్ కు దేశ ప్రజలందరినీ ఏకం చేయటం అనేది ఆయనకు శక్తికి మించిన భారం. అది అతనొక్కడే మోయలేడు కాబట్టే అసదుద్దీన్ ఓవైసీతో కలిసి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడట ఈ గులాబీ బాస్. ఇందుకోసం మజ్లిస్ పార్టీ అధినేత అసద్దుద్దిన్‌తో చేతులు కలపనున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇద్దరూ కలిసి.. దేశంలోని ప్రధాన పార్టీల నాయకులను కలవడమే కాకుండా దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకొని బీజేపీ, కాంగ్రెస్‌లకు అడ్రస్ లేకుండా చేయాలనేది వీరి ప్లాన్ అట.

ఇలా చాలా పెద్ద ప్లాన్ చేసిన కేసీఆర్ అండ్ మజ్లిస్ నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలీదు. అయితే అసదుద్దిన్ ఒవైసీకి దేశవ్యాప్తంగా ముస్లింలలో మంచి పట్టుంది. అలాగే కేసీఆర్‌కు కొన్ని వర్గాలలో మద్దతుంది. అలాగే ఇప్పుడు సాధించిన విక్టరీ ఈయనకు బాగా ప్లస్ అవుతుంది. దీన్ని చూపించి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యాలని చూస్తున్నారు. ఇక కేసీఆర్ పై నమ్మకం రావాలంటే అసదుద్దీన్ వారికి గులాబీ బాస్ గొప్పతనం వల్లించాలి అలాగే అసద్ మాట వినాలంటే కేసీఆర్ సైతం అసద్ గురించి చెప్పాలి. కాబట్టి ఒకరికి ఒకరు బాసటగా దేశ రాజకీయాల్లో అడుగులు వెయ్యాలని , అందుకు రైట్ టైం ఇదేనని భావించి ఇలాంటి తరుణంలోనే జాతీయ స్దాయి రాజకీయాలలో వేలు పెట్టొచ్చనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తుంది. అయితే జాతీయ స్థాయిలో తన మార్క్ వేసుకోవటమంటే మామూలు విషయం కాదని కేసీఆర్ కు తెలుసు.

దానికి ఎంతో రాజకీయ పరిజ్ఞానం, మెళకువలు తెలిసుండాలి. మాటలతో అయితే కేసీఆర్ తెలంగాణ ప్రజలను బుట్టలో వేశారు కానీ అదే ఫార్ములా దేశంలో వర్తిస్తుందా... ఒకపక్క రైతు బంధు పతాకాన్ని దేశం అంతా అమలు చేస్తామంటే దేశంలోనూ వివిధ పార్టీల నుండి రెస్పాన్స్ రాదా.. కేసీఆర్ అజెండా ప్రభావం దేశ రాజకీయాల మీద ప్రభావం ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడమంటే.. అది కేసీఆర్ అజెండాపై ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ తీసుకు వచ్చిన మైనార్టీ ఓట్ల ఫార్ములా కూడా బీజేపీ కాంగ్రెస్ లను ఇరుకున పెడుతుందని అన్ని పార్టీలు విశ్వసించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల బీజేపీ మీద గెలవటం కోసం కాంగ్రెస్ ముస్లింలను కొంచెం దూరం పెడుతోందని తెలుస్తుంది. అందుకే కేసీఆర్ ముస్లిం ఓటు బ్యాంకు టార్గెట్ గా దేశ రాజకీయాల్లో ఓవైసీలతో కలిసి తొలిపావు కదపనున్నారు. మరి ఈ ప్లాన్ ఏం మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Related News