Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణలోపార్లమెంట్ ఎన్నికల బరిలో జనసేన ... రీజన్ ఇదే

Category : state politics

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? తెలంగాణలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగబోతోందా? అంటే అవును అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో జనసేన పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుతుంది అనే విషయం పక్కన పెడితే జనసేన పార్టీ కేవలం ఏ పీ కే పరిమితమైన పార్టీ కాదు అని తెలియజేయాలన్న ఉద్దేశం ప్రధానంగా ఇందులో కనిపిస్తుంది.

జనసేన పార్టీ తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఏపీకే పరిమితమవుతుందా అన్న అనుమానాలు తలెత్తాయి. ఇక ఏపీలోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో సంస్థాగతంగా బలహీనంగా ఉన్న జనసేన పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణపై దృష్టి సారించరు అని అందరూ భావించారు. ఎందుకంటే ఏపీలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణపై దృష్టి సారించరు అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలో జనసేన పార్టీ నుండి అభ్యర్థులను బరిలోకి దింపనున్నారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి అంటే తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలోనే పార్లమెంట్ ఎన్నికల వరకైనా కమిటీలను వేసి ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు. అందులో భాగంగానే పలు పార్లమెంట్ స్థానాల పరిధిలో పని చేయడం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఇన్చార్జులను సైతం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

త్వరలో తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న ఎన్నికల బరిలోకి జనసేన కూడా దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాదు.. కేవలం మూడు స్థానాల్లో ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖలోమ్మం పార్లమెంటరీ స్థానాల నుంచి జనసేన తరపున అభ్యర్ధులను నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. తెలంగాణలో ఇంకా పార్టీ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగని కారణంగా మిగతా స్థానాల విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే మిగతా లోకసభ స్థానాలకు సైతం కమిటీలను ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చేవెళ్ల, నాగర్ కర్నూల్, మెహబూబ్ నగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, భువనగిరి స్థానాలకు కమిటీలను సిద్ధం చేసి త్వరగానే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

అందుకే ముందుగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఖమ్మం మూడు స్థానాల్లో పోటీ చేయాలనే యోచనలో ఉన్నారట. ఇక వామపక్ష పార్టీలతో పొత్తు వున్న కారణంగా వామపక్ష పార్టీల ప్రభావం ఉన్న మూడు నాలుగు స్థానాలను వారికి కేటాయించిన ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం సంచలన నిర్ణయం తీసుకొని తెలంగాణ బరిలో దిగనుంది. ఒక పక్క కేసీఆర్ 16 స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామని ధీమాతో ఉన్న సమయంలో జనసేన ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా తెలంగాణాలోనూ జన్సేన తన ఉనికిని చాటబోతుంది.

Related News