//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గురువారం నుంచి ఐదు రోజులు వరుస బ్యాంకుల బంద్ వెనకున్న అసలు నిజమిది

Category : national

ఈ మధ్య కొన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా విశేష ఆదరణ పొందుతున్నాయి. వాస్తవాల కంటే కూడా అవాస్తవాలే ముందుగా వైరల్ అవుతున్నాయి.

వివరాల లోకి వెళితే ఈ గురువారం నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు పని చేయవని, ఏవైనా అత్యవసర ఆర్థిక లావాదేవీలు ఉంటే బుధవారంలోగా చూసుకోవాలని సోషల్ మీడియాలో విశేషంగా ప్రచారం జరుగుతోంది. అయితే జరుగుతున్న ఈ ప్రచారం, దాని వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఆందోళన మీద ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందించింది.

ఈ వార్తలు అవాస్తవమని, వరుసగా ఐదు రోజుల సెలవులు లేవని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య జనరల్‌ సెక్రటరీ థామస్‌ ఫ్రాంకో రాజేంద్ర దేవ్‌ మీడియా లో ప్రకటించారు. మహావీర్ జయంతి సందర్భంగా గురువారం ఆపై గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బ్యాంకులకు సెలవని, శనివారం నాడు బ్యాంకులకు ఈ నెలలో ఐదో శనివారం కాబట్టి పని చేస్తాయని అలాగే ఏప్రిల్ 1న ఆదివారం కాబట్టి ఆరోజు బ్యాంకులకు సెలవని చెప్పారు.

రెండో తేదీన బ్యాంకులకు సెలవు విషయమై మాత్రం ఆయన స్పష్టతను ఇవ్వలేదు. అంటే గురు, శుక్రవారాలు బ్యాంకులకు సెలవు. ఆపై శనివారం బ్యాంకులు పనిచేస్తాయి. ఆదివారం ఎలాగూ బ్యాంకులు మూసే ఉంటాయి.