//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాస్‌ గెలిచిన కోహ్లి సేన...రాజస్థాన్ 52 / 1 ......!

Category : sports

ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా ఈ రోజు రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫీల్డింగ్‌ వైపే మొగ్గు చూపాడు. చేజింగ్‌లో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు.

ఇక ఆర్సీబీ జట్టులోకి సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానంలో పవన్‌ నేగి రాగా.. రాజస్థాన్‌ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ గెలిచాయి. ఇక ఆర్సీబీ ఆటగాడు, హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఎలాగైన ఈ మ్యాచ్‌ను గెలిచి తమ విజయయాత్రను కొనసాగించాలని కోహ్లిసేన భావిస్తుండగా.. సొంత గడ్డపై ఆర్సీబీని ఒడగొట్టాలని రాజస్తాన్‌ ఉవ్విళ్లురుతోంది. ప్రతి సీజన్‌లో పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం ఆర్సీబీ గ్రీన్‌ జెర్సీలో ఓ మ్యాచ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో నేటి మ్యాచ్‌లో ఆకుపచ్చని జెర్సీలతో బరిలోకి దిగింది.

ఈ మ్యాచ్ ప్రారంభం నుండే రహానే తన ప్రతాపాన్ని చూపిస్తూ వున్నాడు. వచ్చి రాగానే భారీ షాట్ లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమం లో రహానే 36 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ స్క్రోర్ 52 / 1 .

Related News