ఐపీఎల్ సీజన్-11లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ లో పంజాబ్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ లో విజయం సాధించింది . చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బెంగళూరు బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో పంజాబ్ అల్ అవుట్ అయింది. పంజాబ్ బ్యాటమెన్స్ లో కేఎల్ రాహుల్ (47), కరుణ్ నాయర్ (29), అశ్విన్ (33) ఆకట్టుకోవడంతో 155 పరుగులు చేసిన పంజాబ్ ఆలౌట్ అయింది.మొదటి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా కొత్త పెళ్లి కొడుకు ఫించ్ డక్ అవుట్ అయ్యాడు. తరువాత తక్కువ స్కోర్ కె యువి కూడా పేవిలియాన్ కి చేరాడు.
విరామం అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ను తోలి ఓవర్ లోనే స్పిన్నర్ అక్షర్ పటేల్ కోలుకోలేని దెబ్బ తీసాడు. విధ్వంసకర ఆటగాడు బ్రెండెన్ మెక్లం ను డక్ అవుట్ చేసాడు. తరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా కెప్టెన్ కోహ్లీ చూడ చక్కని షార్ట్ లతో అలరించాడు, కీలక దశలో పంజాబ్ బౌలర్లు కోహ్లీ (21) ని అవుట్ చేసారు.
నాలుగు ఓవర్లలో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో డివిల్లీర్స్ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. ముజీబ్ వేసిన 17వ ఓవర్లో వ రుసగా రెండు సిక్సర్లు.. మన్దీప్ ఫోర్‌తో 19 రన్స్ రావడంతో లక్ష్యం సులువైంది. ఆ తర్వాత మరో సిక్స్‌తో 37 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన డివిల్లీర్స్ 19వ ఓవర్లో వెనుదిరిగాడు. డికాక్ (45) కూడా ధాటిగా ఆడాడు. మన్దీప్ 22 చేసి అవుట్ కావడంతో చివర్లో ్ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్లో 5 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతిని సుందర్ ఫోర్ కొట్టి జట్టు కు విజయాన్ని అందించాడు.