//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూ 2,000 నోట్ల పంపిణీని నిలిపివేసిన ఆర్బీఐ

Category : national

పెద్ద నోట్ల రద్దు అనంతరం మార్కెట్ లోకి తీసుకువచ్చి, చిల్లర దొరకక ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రూ 2,000 నోట్ల పంపిణీని రిజర్వు బ్యాంక్ ఇప్పుడు దాదాపుగా నిలిపివేసిన్నట్లు తెలుస్తున్నది. నోట్ల రద్దు మొదటినుండి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం లేకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొంటూ గందరగోళంగా ఉన్నట్లు కనిపించడం తెలిసిందే.

 ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ . రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను తగ్గించి, కొన్ని వారాలుగా రూ 500 నోట్లను ఎక్కువగా పంపిణి చేస్తున్నట్లు కనిపిస్తున్నది.  ''ప్రస్తుతం ఎక్కువగా రిజర్వు బ్యాంకు నుంచి ఎక్కువ విలువ కలిగిన నోట్లలో రూ 500  నోట్లే ఎక్కువగా వస్తున్నాయి'' అని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ నీరజ్‌ వ్యాస్‌ చెప్పారు. రూ  2000  నోట్లను రీసర్క్యూలేషన్‌ కిందనే తిరిగి మళ్లీ తమ దగ్గరకు వస్తున్నాయని, కొత్తగా ఆర్బీఐ నుంచి ఏమీ రావడం లేదని అయన తెలిపారు. 

ప్రతి ఏటీఎంలలో నగదును స్టోర్‌ చేయడానికి నాలుగు క్యాసెట్లు ఉంటాయని, ఒకవేళ ఒక క్యాసెట్‌ రూ  2000  నోట్లను కలిగి ఉంటే ఆ మొత్తం రూ.60 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. అదేవిధంగా ఒకవేళ ఆ క్యాసెట్‌ను రూ.500 నోట్లతో నింపితే, మెషిన్‌ సామర్థ్యం రూ.25 లక్షలకు పడిపోతుందని వెల్లడైంది. 

కాగా,  కస్టమర్లకు తేలికగా చిల్లర దొరకడానికి, ఏటీఎంల వద్ద సామర్థ్యం తగ్గినప్పటికీ రూ.500 నోట్లనే ఎక్కువగా సరఫరా చేయాలని  ఆర్బీఐ దృష్టి సారించిందని తెలిసింది. నోట్ల రద్దు ముందుటి కన్నా తక్కువగా నగదు ప్రస్తుతం మార్కెట్‌లో ఉంది. సెంట్రల్‌ బ్యాంకు త్వరలోనే చిల్లర సమస్యను మరింత తగ్గించడానికి కొత్త రూ.200 నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతుంది. కానీ ఆ నోట్లను ఆర్బీఐ ఏటీఎంల ద్వారా అందించనని స్పష్టం చేసింది.