//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రద్దయిన నోట్లను ఇంకా లెక్కపెడుతున్న ఆర్బీఐ

Category : national

వినియోగదారులు డిపాజిట్‌ చేసిన రద్దయిన కరెన్సీ నోట్లను తమ ప్రత్యేక బృందం 24గంటలూ శ్రమిస్తూ ఇంకా లెక్కిస్తూనే వుందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పార్లమెంటరీ స్థాయీ సంఘ సభ్యులకు వివరించారు. తమ సిబ్బంది ఆదివారం సెలవు మినహా ఇప్పటి వరకు ఎటువంటి సెలవులు తీసుకోకుండా లెక్కిస్తూనే వున్నారని ఆయన వివరించారు. 

రద్దయిన నోట్ల స్థానంలో ఆర్థిక వ్యవస్థలోకి ఎంత కొత్త కరెన్సీ వచ్చిందని సమాజ్‌వాది పార్టీ ఎంపి నరేష్‌ అగర్వాల్‌, తృణమూల్‌ ప్రతినిధి సౌగత్‌ రారు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, గత ఏడాది నవంబర్‌లో ప్రధాని పాత కరెన్సీ నోట్ల రద్దు ప్రకటించే నాటికి 17.7 లక్షల కోట్ల విలువైన నగదు చెలామణిలో వుందని, దాని స్థానంలో ఇప్పుడు 15.4 లక్షల కోట్ల నగదును చెలామణిలోకి తెచ్చామని చెప్పారు.

 నేపాల్‌ వంటి దేశాల నుండి మన దేశంలోకి వస్తున్న రద్దయిన నోట్లను స్వీకరించాల్సిందిగా సహకార బ్యాంకులను కోరామని చెప్పారు. నోట్ల రద్దు అనంతరం ప్రజలు డిపాజిట్‌ చేసిన పాత నోట్లను పోస్టాఫీసులు ఇప్పటి వరకూ రిజర్వ్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయలేదన్నారు. నోట్ల రద్దు ప్రభావంపై అధ్యయనం చేస్తున్న పార్లమెంటరీ కమిటీ ముందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ హాజరు కావటం ఇది రెండోసారి.