//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాయపాటి కూడా జంప్ అవుతారా ? ఎందుకిలా ?

Category : politics state

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకపక్క టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అభ్యర్థుల ప్రకటన కసరత్తులు చేస్తుంటే, చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ రాని సీనియర్ నేతలు సైతం పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా రాయపాటి సాంబశివరావు పక్క చూపులు చూస్తున్నాడు అని చర్చ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సీనియర్‌ నాయకుడు రాయపాటి సాంబశివరావు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వైఖరిపై తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు. టిక్కెట్‌ విషయంలో ఇప్పటికీ చంద్రబాబు నుంచి హామీ లభించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ స్థానంపై కూడా క్లారిటీ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ మారే యోచన చేస్తున్నారని ఆయన అనుచరులు వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్య అనుచరులతో చర్చించి త్వరలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.