//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Category : national

కేంద్రంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు.

ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీలోనే నేతలకు తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతలున్నాయని చెప్పారు. పదవుల రాజీనామాకైనా.. అవిశ్వాసానికైనా తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీజేపీతో పొత్తు వ్యవహారం కూడా త్వరలోనే తేలిపోతుందన్నారు.

సీఎం చంద్రబాబు ఆదేశం కోసం ఎదురు చూస్తున్నామని,2019లో కూడా ఏపీలో టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాంబశివరావు జగన్‌పైనా మండిపడ్డారు. ఆయన మోకాళ్లపై యాత్ర చేసినా అధికారంలోకి రాలేడన్నారు సాంబశివరావు. ఏపీకి న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ పోరాడుతున్నారని... ఆయనకు టీడీపీ సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు.

మోదీ సొంతపార్టీలోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతలున్నాయని ఆయన ఆరోపించారు. పదవుల రాజీనామాకైనా, అవిశ్వాసంకైనా మేం సిద్ధంగా ఉన్నామని రాయపాటి తేల్చిచెప్పారు. ఓవైపు సంయమనం పాటించాలని చంద్రబాబు చెబుతుంటే... ఇటు నేతలు మాత్రం మిత్రపక్షంపై మండిపడుతున్నారు. మరి రాయపాటి వ్యాఖ్యలపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.