//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రవితేజ ప్లాప్ మూవీ సీక్వెల్...చేస్తాడా...!

Category : movies

రవితేజ మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న ఈ ఎనర్జిటిక్ హీరో ఇటీవల రాజా ది గ్రేట్ చిత్రం తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు.నటనలో మేనరిజం లో తనదయిన బాడీ లాంగ్వేజ్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు.ఇటీవల టచ్ చేసి చూడు తో మన ముందుకి వాచిన రవికి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.కాస్త కెరీర్ లో రవితేజ వెనకపడ్డాడనే చెప్పాలి.ఇప్పుడు తాజా గ రవి తేజ తో ఒక ప్లాప్ చిత్రానికి సీక్వెల్ చేస్తారనే టాక్ వినపడుతుంది.వివరాలలోకి వెళ్తే,

తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో 'నాడోడిగళ్' అనే సినిమా వచ్చింది. తమిళంలో బాగా ఆడిన ఈ సినిమాను తెలుగులో రవితేజ ప్రధాన పాత్రగా 'శంభో శివ శంభో' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఇక్కడ పరాజయాన్నే చవిచూసింది. అయితే ఇప్పుడు 'నాడోడిగళ్' సినిమాకి సీక్వెల్ చేయడానికి సముద్రఖని సన్నాహాలు చేస్తున్నాడు.

సీక్వెల్ కథను రవితేజకు వినిపించడానికి సముద్రఖని రెడీ అవుతున్నాడు. తెలుగులో 'శంభో శివ శంభో' పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా సీక్వెల్ చేయడానికి రవితేజ అంగీకరించకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.మరి రవి తేజ ఈ చిత్రాన్ని ఒప్పుకుంటాడా లేదా అన్న సంగతి తెలియసి వుంది.

Related News