//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ర‌వితేజ‌కు ఇద్ద‌రు హీరోయిన్ల బ‌జ్‌..!

Category : movies

మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ ఏ మాత్రం స్పీడ్ త‌గ్గించ‌లేదు. ఈ నెల‌లోనే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చిత్రంతో రాబోతున్న ర‌వితేజ త‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. ర‌వితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో ఇద్ద‌రు క్రేజీ హిరోయిన్ల‌ను సెలెక్ట్ చేసేసింది మూవీ టీమ్‌.

ర‌వితేజ న‌టించిన లేటెస్ట్ మూవీ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో, శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇలియానా హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ నెల 15న విడుద‌ల‌వుతోంది. సాంగ్స్‌, టీజ‌ర్ వ‌ల్ల సినిమాపై పాజిటివ్ బ‌జ్ కూడా ఏర్ప‌డింది. ఈ మూవీ రిలీజైన వెంట‌నే ఈ మాస్ కొత్త సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నాడు.

ర‌వితేజ కొత్త సినిమాకు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వీఐ ఆనంద్ ద‌ర్శ‌కుడు. ఇందులో ర‌వితేజ డ్యూయెల్ రోల్ పోషించ‌బోతున్నాడు. అందులో భాగంగా ఇద్ద‌రు హీరోయిన్లను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. న‌న్నుదోచుకుందువ‌టే మూవీతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయి మంచి పేరు తెచ్చుకున్న న‌భాన‌టేష్‌ను ఓ హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. అలాగే, ఆర్ఎక్స్ 100 మూవీతో యూత్‌ను ఎట్రాక్ట్ చేసిన పాయ‌ల్ రాజ్‌పుత్‌ను మ‌రో హీరోయిన్‌గా తీసుకున్నారు. దీంతో సినిమాపై బ‌జ్ ఏర్ప‌డుతోంది. ఈ ల‌క్కీ బ్యూటీస్ ఇద్ద‌రూ ర‌వితేజ సినిమాకు ప్ల‌స్ అవుతార‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్‌తో ఉంది.