Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భార్య ఉండగానే మరో పెళ్ళికి రెడీ అయిన టీం ఇండియా కోచ్

Category : sports

అవును టీం ఇండియా కోచ్ భార్య ఉండగా మరో పెళ్ళికి రెడీ అయ్యారు అంటూ ఇప్పుడు వస్తున్న వార్తలు టాలివుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే బాలివుడ్ హీరోయిన్లకు క్రికెటర్లకు పెళ్ళిళ్ళు అవ్వడం మనం గత కొంత కాలంగా చూస్తూనే ఉన్నాం. వీరి ప్రేమాయణాలు అంతర్జాతీయంగా హాట్ గా కూడా మారాయి. అయితే తాజాగా మరో జంట ఈ జాబితాలో చేరింది. వారే టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి, హీరోయిన్ నిమ్రత్ కౌర్. వీరికి త్వరలో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.

అదేంటి శాస్త్రికి భార్య ఉంది కదా అంటారా.. అవును అయినా ఆయన ఆమెతో ఎలాంటి విబేధాలు లేకుండానే వివాహానికి సిద్దపడుతున్నారు అంటుంది బాలివుడ్. 2015లో జర్మనీకి చెందిన ఓ లగ్జరీ కార్ల కంపెనీ నిమ్రత్‌, రవిశాస్త్రిలను ప్రచారకర్తలుగా నియమించింది. అలా తొలిసారి కలుసుకున్న ఈ ఇద్దరు అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారట. రవికి 56 ఏళ్ళు కాగా నిమ్రత్ కి 36 ఏళ్ళు. రవిశాస్త్రికి 1990లో రీతూ సింగ్‌తో వివాహమైంది. వీరికి అలేఖా అనే కుమార్తె కూడా ఉంది. అయినా సరే ఆ విభేదాలు బయటపెట్టకుండా వివాహానికి సిద్దమయ్యాడట.

Related News