//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రవిశాస్త్రి జగడం ... పవర్‌ కట్‌ దిశగా బీసీసీఐ

Category : sports

పట్టుబట్టి టీమిండియా కోచ్ గా ఎంపికై మూడు రోజులైనా గడవక ముందే రవిశాస్త్రి సరికొత్త జగడానికి తెరలేపుతున్నారు. తనకిష్టమైన వారే తన  సహాయక బృందంలో ఉండాలని స్పష్టం చేస్తున్నారు. బీసీసీఐ ఆదేశాల మేరకు క్రికెట్‌ సలహా సంఘం అతనికి సహాయంగా బ్యాటింగ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌, బౌలింగ్‌ కోచ్‌గా జహిర్‌ఖాన్‌ నియమించిన విషయం తెల్సిందే. అయితే వీరిద్దరు కన్సల్టెంట్లుగా పనిచేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బౌలింగ్‌ కోచ్‌గా అరుణ్‌ ను తీసుకురావడానికి మొండిపట్టు పడుతున్నారు. 

ఈ విషయాన్ని పసికట్టిన బీసీసీఐ రవిశాస్త్రి ఎత్తుగడకు పంచ్‌ వేసింది. ద్రావిడ్‌, జహిర్‌ ఖాన్లు కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తారని తెలిపింది. దీంతో శాస్త్రి పట్టుబిగింపు వ్యవహరంపై పవర్‌కట్‌ అస్త్రాన్ని బీసీసీఐ ప్రయోగించింది. జహిర్‌ ఉన్నప్పటికీ మాజీ బౌలింగ్‌ కోచ్‌ అరుణ్‌ కావాలని శాస్త్రి అడుగుతున్నట్లు సమాచారం. 

ఒప్పందం ప్రకారం జహిర్‌ ఏడాదిలో 100 రోజులే అందుబాటులో ఉంటాడు. ఆయన జీత భత్యాలపై బీసీసీఐ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అందుకే రోజువారీ విధుల్లో భరత్‌ తనకు సహాయకారిగా ఉంటాడని శాస్త్రి అంటున్నారు. అయితే  శ్రీలంక పర్యటనకు బ్యాటింగ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌, బౌలింగ్‌ కోచ్‌గా జహిర్‌ ఖాన్‌ ఇద్దరు వెళతారని బీసీసీఐ స్పష్టం చేయడం గమనార్హం. 

అరుణ్‌కు సాంకేతికంగా అపార అనుభవం ఉందని, బౌలర్ల లోపాలను పసిగట్టి సవరించే సామర్థ్యం అతని సొంతం అని విదేశాల్లోనూ నిరూపితమైందని శాస్త్రి వాదిస్తున్నారు. జహీర్ నాణ్యమైన బౌలర్ అయినా కోచ్‌గా అనుభవం అసలు లేదని  అంటూ అనుభవం లేకపోతే ఏం జరుగుతుందో కుంబ్లే విషయంలో చూశాం అంటూ తన పంతం నెగ్గించుకొనే ఎత్తుగడ వేస్తున్నారు. 

Related News