//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అబ్బాయిలకు రావణకాష్ట ఆరంభం..!

Category : national

పూర్వంలో మహిళలను బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లిచేసుకునే విధానాన్ని రాక్షస వివాహంగా పేర్కొనేవారు.అయితే ఇదే సంప్రదాయం రివర్స్ అయ్యింది.ఏకంగా అబ్బాయిల్ని అపహరించి బలవంతంగా వివాహం చేసుకోవడంపై జనం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.ఇలాంటి ఘటనలు బిహార్‌లో గతేడాది 3405 మంది యువకుల్ని కిడ్నాప్ చేసి, బలవంతంగా వివాహం చేసుకున్నారని ఓ పోలీస్ అధికారి తెలిపారు.ఇందుకు అంగీకరించకపోతే వారిని, వారి కుటుంబసభ్యులను చంపుతామని బెదరింపులకు పాల్పడతారని ఆయన పేర్కొన్నారు.పకడవ్ వివాహంగా పిలిచే ఈ దుస్సంప్రదాయం బిహార్‌లో అధికంగా ఉందని అన్నారు.

తనపై తుపాకి గురిపెట్టి బెదిరించి, బలవంతంగా యువతి మెడలో తాళికట్టించారని, ఆమెతో కాపురం చేయలేనని గత నెలలో బీహార్‌కు చెందిన ఓ ఇంజినీర్ మీడియా ముందుకు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.ప్రభుత్వ నివేదిక ప్రకారం ఇలాంటి వివాహాలు 2016లో 3,070, 2015లో 3,000, 2014లో 2,526 నమోదయ్యాయని, దాదాపు ఈ కేసులన్నింటిలోనూ యువకులు, వారి తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు.పోలీసుల నివేదిక ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున ఇలాంటి ఘటనలు తొమ్మిది జరుగుతున్నాయి.ఏటా వీటి సంఖ్య పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.దీన్ని సీరియస్‌గా పరిగణించి, బీహార్‌లోని అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు.

త్వరలో వివాహాల సీజన్‌ ఆరంభం కానుండటంతో వీటిని నియంత్రించాలని ఆదేశాలు అందాయి.వరకట్నానికి డిమాండ్ అధికంగా ఉండటంతో పకడవ్ వివాహం అనే సామాజిక సమస్య గతంలో ఉందని హక్కుల కార్యకర్త మహేంద్ర యాదవ్ వ్యాఖ్యానించాడు.అయితే ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరగడం అనేది ఆందోళన కలిగించే అంశమని మహేంద్ర అన్నారు.సరైన యువకుడిని ఎంపికచేసుకుని అమ్మాయిల కుటుంబాలు అతడిని అపహరించి, బలవంతంగా వివాహం జరిపిస్తాయని అన్నాడు.

దీనికోసం స్నేహితులు, బంధువులే కాకుండా కొన్ని సందర్భాల్లో కరడుగట్టిన నేరస్థులను సైతం ఆశ్రయిస్తారని తెలిపారు.జాతీయ నేర నమోదు బ్యూరో నివేదిక 2015 ప్రకారం 18 ఏళ్లు నిండిన అబ్బాయిల అపహరణలో బిహార్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది.18 నుంచి 30 ఏళ్ల మధ్య యువకులు 2015లో 1,096 మంది అపహరణకు గురయ్యారని, ఇది జాతీయ సగటుతో పోల్చితే 17 శాతం అధికమని నివేదిక స్పష్టం చేసింది.