//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెంపుడు కుక్క‌కు రేష‌న్ స‌రుకులు.. ఓ అదా..! చ్ఛి..చ్ఛీ..!!

Category : national

పెంపుడు కుక్క‌కు స‌ర్కార్ రేష‌న్ స‌రుకులు ఇస్తుందా...? అని ప్ర‌శ్నిస్తే.. అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన న‌ర్సింగ్ బోధార్‌. ఇదేంటి..? కుక్క‌కు కూడా రేష‌న్ స‌రుకులు ఇవ్వ‌డ‌మేంటి..? అని అనుకుంటున్నారా..? మ‌ధ్య ప్ర‌దేశ్‌లో అధికారుల నిర్వాకానికి నిద‌ర్శ‌న‌మైన ఈ వింత ఉదంతం గురించి తెలుసుకోవాలంటే మ‌నం బోడియా గ్రామానికి వెళ్లాల్సిందే.

ఓ కుక్క ప్ర‌భుత్వ ప్ర‌జా పంపిణీ వ్య‌వస్థ కింద ఏర్పాటైన చౌక‌ధ‌ర‌ల దుకాణం నుంచి రేష‌న్ స‌రుకులు పొందిన వింత ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బోడియా గ్రామ పంచాయ‌తీలో వెలుగు చూసింది. గ‌త సంవ‌త్స‌రం ఓ కుక్క‌కు 60 కిలోల రేష‌న్ స‌రుకుల‌ను పంపిణీ చేశార‌ని తాజాగా గుర్తించిన అధికారులు నాలిక క‌ర్చుకున్నారు. బోడియా గ్రామానికి చెందిన నర్సింగ్ బోధార్ త‌న పెంపుడు కుక్క రాజు పేరును కుమారుడిగా రేష‌న్ కార్డులో న‌మోదు చేయించారు.

బోడియా చౌక ధ‌ర‌ల దుకాణంలో ఆధార్ కార్డుల‌ను త‌నిఖీ చేస్తుండా, న‌ర్సింగ్ బోధార్ తన భార్య‌తోపాటు రాజు అనే కుమారుడు ఉన్నాడ‌ని పేర్కొన్నారు. రాజు ఎక్క‌డ అని ప్ర‌శ్నిస్తే, త‌న పెంపుడు కుక్కే త‌న కుమారుడ‌ని న‌ర్సింగ్ సెల‌విచ్చాడ‌ని పౌర స‌ర‌ఫ‌రాల‌శాఖ అధికారి ఆనంద్ తెలిపారు.

న‌ర్సింగ్ ప్ర‌తీ వారంలాగే, రేష‌న్ స‌రుకుల కోసం చౌక‌ధ‌ర‌ల దుకాణానికి వ‌చ్చాడు. కార్డులో ఉన్న కుటుంబ స‌భ్యుల ఆధార్ కార్డుల జెరాక్స్ కాపీల‌ను ఇవ్వాల‌ని దుకాణంలోని సేల్స్‌మెన్ కైలాష్ కోరాడు. న‌ర్సింగ్ త‌న భార్య‌, త‌న ఆధార్ కార్డు జెరాక్స్ కాపీల‌ను అందించాడు. మీ కుమారుడు రాజు ఆధార్ కార్డు ఎక్క‌డుంద‌ని సేల్స్‌మెన్ ప్ర‌శ్నించాడు. ఓ.. అదా.. రాజు అంటే అది నా పెంపుడు కుక్క అంటూ న‌ర్సింగ్ తాపీగా సెల‌విచ్చాడు. దాంతో సేల్స్‌మెన్‌తోపాటు పౌర స‌ర‌ఫ‌రాల‌శాఖ అధికారులు నివ్వెర పోయారు. ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించి కుక్క పేరుతో రేష‌న్ స‌రుకులు తీసుకున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి చెప్పారు.