//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తొమ్మిది గంటలు విమానాన్ని ఆపిన ఎలుక

Category : national

మరికొద్ది క్షణంలో టేక్ అఫ్ కి సిద్ధంగా ఉన్న విమానంలో సిబ్బందికి అనుకోని అతిథి కనిపించడంతో ఆ విమానం తొమ్మిది గంటలు ఆలస్యంగా ప్రారంభం కావలసివచ్చింది. విమానంలో ఉన్నఆ వూహించని అతిథి ఎవరు అనుకుంటున్నారా అదేనండి మన గణేష్ వాహనం ఎలుక. ఈ సంఘటన ఢిల్లీలో ఆదివారం ఉదయం జరిగింది. దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు 200 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమౌతున్న ఎయిరిండియా విమానంలో హఠాత్తుగా ఎలుక కనిపించింది. దీన్ని పంపించేందుకు విమానాన్ని పార్కింగ్‌ బేలో నిలిపి, పొగబెట్టే(ఫ్యుమిగేటెడ్‌) ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆరుగంటలు పట్టింది. ఈలోగా సిబ్బంది పని వేళలు ముగిశాయి. డీజీసీఏ నిబంధనల ప్రకారం సిబ్బంది వరుస షిఫ్టుల్లో పనిచేసేందుకు అనుమతి లేదు. దీంతో మరో దఫా సిబ్బంది విధుల్లోకి వచ్చేసరికి ఇంకో మూడు గంటలకు పైగా సమయం పట్టింది.