//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ రూమర్స్ నిజమేనంటా..?

Category : movies

టాలీవుడ్ యంగ్ బ్యూటీ రష్మిక మందన గీత గోవిందం చిత్రం సక్సెస్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. విజయదేవరకొండ గీత గోవిందం చిత్రం ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

విజయ్ దేవర కొండా క్రేజ్, దర్శకుడు పరశురామ్ చిత్రాన్ని మలచిన విధానంతో ఈ సినిమా మరోస్థాయికి చేరింది. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య కెమిస్ట్రీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ లో అద్భుతమైన అవకాశాలతో దూసుకుపోతున్న రష్మిక గురించి కొంత కాలంగా సినీవర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

గత ఏడాదే రష్మిక, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జరిగింది. ఆ ఎంగేజ్ మెంట్ బ్రేక్ అప్ అయిందని, వీరిద్దరూ విడిపోయారని కొంత కాలంగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్ నిజమే అంతో సదరు ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది.ఇరు కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనించిన రష్మిక ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాను కెరీర్ పై దృష్టి పెట్టాలని రష్మిక భావిస్తోందట. కఠినమే అయినప్పటికీ రష్మిక అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్మిక సన్నితులే ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది.

గోవిందం చిత్రం విజయం తరువాత తరువాత రష్మిక తెలుగు, కన్నడ భాషల్లో మరిన్ని అవకాశాలు అంటుకుంటోంది. రష్మిక ప్రస్తుతం దేవదాస్, కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. రష్మిక, రక్షిత్ శెట్టి కలసి కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి నిశ్చితార్థం వరకు వెళ్ళింది. ఛలో చిత్రం ఛలో చిత్రంతో టాలీవడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక చలాకి హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఆ తరువాత గీత గోవిందం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.