//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముఖం చాటేస్తున్న కన్నడ బ్యూటీ......

Category : movies

తెలుగు లో మంచి ఫేమ్ వున్నా కన్నడ బ్యూటీ రష్మిక......ఛలో, గీతా గోవిందం, దేవదాస్ చిత్రాల తర్వాత కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్‌ మాంచి జోరు మీద వున్నా సంగతి అందరికి తెలిసిందే కానీ తన వ్యక్తి గత జీవితం లో వచ్చిన కొన్ని మార్పుల వాళ్ళ సోషల్ మీడియా లో అందరూ ఈమె గురించే మాట్లాడుకున్నారు .రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకోవడం వాళ్ళ దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

ఛలో సినిమా తర్వాత రష్మిక కెరీర్ ఓ టర్న్ తీసుకొన్నది. చాలా ఆఫర్స్ రష్మిక తలుపు తట్టాయి. దాంతో పర్సనల్ లైఫ్ కంటే తన కెరీర్‌ ముఖ్యమని భావించింది. దాంతో ప్రేమ, పెళ్లికి పుల్‌స్టాప్ పెట్టాలని రష్మిక నిర్ణయం తీసుకొన్నది. కెరీర్‌కే ప్రాధాన్యం ఇవ్వడం రక్షిత్ శెట్టి కుటుంబ సభ్యులకు నచ్చలేదట. ఈ విషయం వాళ్ళ తన పర్సనల్ లైఫ్ గురించి తెలియని వాళ్ళకి కూడా తెలిసి ఈ విషయం వైరల్ అయింది .

ప్రెసెంట్ గీత గోవిందం, దేవదాస్ బ్లాక్ బస్టర్లుగా మారడంతో రష్మికకు టాలీవుడ్‌లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. దాంతో తెలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్‌ను ముందుకు సాగిస్తుంది . అయితే ఈమె కన్నడ మూవీస్ కి కొంచం దూరం గా ఉన్నట్లు సమాచారం. కన్నడ పరిశ్రమకు దూరం గా ఉండటం పై సోషల్ మీడియా లో కొంతమంది ఈమెను ట్రోల్ చేస్తున్నారు . దాంతో ఆమె సోషల్ మీడియా కి కూడా దూరం గా వుంది .ప్రస్తుతం బెంగళూరుకు దూరంగా ఉండటమే మేలని భావిస్తున్నదట.అయితే అరవింద సమేత చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, శర్వానంద్ సరసన ఓ మూవీని రష్మిక చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.