Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రశ్మిక ఉంటే సినిమా బ్యాన్ !సంచలనం నిర్ణయం

Category : movies

టాలీవుడ్ సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా అతని హిట్ జోడి రష్మికా మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏకకాలంలోనే తెలుగు,తమిళ్,మలయాళం మరియు కన్నడ భాషల్లో తెరకెకెక్కి మిక్స్డ్ స్పందనను సంపాదించుకుంది.అయితే ఇప్పటి వరకు విజయ్ తీసిన సినిమాలు కొన్ని ఇదొక రకంగా వివాదంలో ఇరుక్కున్న సంగతి అందరికి తెలిసిందే.కానీ ఈసారి మాత్రం రష్మిక వల్ల ఈ సినిమా వివాదాల్లో ఇరుక్కుంది.మాములుగా మన పక్క రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు మరియు కర్ణాటక ప్రజలు వారి మాతృ భాషకు ఎంతటి గౌరవాన్ని ఇస్తారో అందరికి తెలుసు.

అయితే ఈ సినిమా కన్నడ వెర్షన్ లో రష్మిక వారు భాషను తక్కువ చేసి మాట్లాడిందని కన్నడ ఇండస్ట్రీ నుంచి రష్మికా మందన్న సినిమాలను నిషేధించాలని కర్ణాటక రక్షణా వేదిక వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు.అంతే కాకుండా ఇక పైన ఆమె సినిమా కర్ణాటకలో ఆడనివ్వమని, కర్ణాటక నుంచి ఆమెని బహిష్కరించాలని కూడా డిమాండ్ చేసినట్టు కూడా ఇప్పుడు మాటలు వినిపిస్తున్నాయి.ఈ వార్త అక్కడ సంచలనం రేపింది.