//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రష్మికను బతకనివ్వండి ....... బ్రేకప్‌పై రక్షిత్ గుండె తరుక్కుపోయేలా లేఖ

Category : movies

కన్నడ తారలు రష్మిక మందన్న, రక్షిత్ నిశ్చితార్థం రద్దుపై తాజా క్లారిటీ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల వారికి చెందిన ఇరు కుటుంబాలు ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు.

రష్మిక, రక్షిత్ కుటుంబాల సమ్మతంతోనే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎలాంటి వివాదం లేకుండా ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో రష్మికపై వస్తున్న రూమర్లకు చెక్ చెబుతూ ఆమెకు రక్షిత్ అండగా నిలువడం గమనార్హం. బ్రేక్ వార్తలను ధృవీకరిస్తూ ఉద్వేగభరితమైన లేఖను ఫేష్‌బుక్‌లో పోస్టు చేశారు.

నిశ్చితార్థం క్యాన్సిల్ కావడంతో గత కొద్దిరోజులుగా జీవితంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి అని రక్షిత్ పేర్కొన్నారు.ఎవరి ప్రేమకైతో పరితపించానో ఎవరి ప్రేమకోసమైతే తపించానో, ఎవరి కోసమైతే బతికానో వారు దూరమైనప్పుడు ఎంత బాధ ఉంటుదో మాటల్లో చెప్పలేం. ఈ వ్యవహారంలో రష్మిక గురించి తప్పుడు అభిప్రాయాలను ఏర్పరుచుకోవద్దు. బయట మాట్లాడుకొంటున్న తీరును నేను తప్పు పట్టాలనే ఉద్దేశం లేదు. మేము చెప్పేది, మాకు తెలిసింది మీరు కూడా నమ్మాలని కోరుకొంటున్నాం అని రక్షిత్ ఉద్వేగంగా పేర్కొన్నారు.

రష్మికతో బ్రేకప్‌కు రష్మికతో బ్రేకప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏదో కారణాన్ని ఊహించుకొని రష్మికపై ఓ అభిప్రాయానికి రావొద్దు. ఆమె ప్రశాంతంగా బ్రతకనివ్వండి. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. నిజమేంటో తెలుస్తుంది అని రక్షిత్ తెలిపారు.