//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Telugu anchor rashmi gautam : తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ : rashmi gautam age family bio data

Category : editorial

రష్మి గౌతమ్ ఒక సినీ నటి, మరియు టి. వి వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్యకార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.రష్మి తల్లి ఒడిషా రాష్ట్రానికి చెందింది. తండ్రి ఉత్తర ప్రదేశ్ కు చెందిన వాడు. విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాదు కు వచ్చింది.

2002 లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది. 2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయనటిగా చేసింది.

ఆ తరువాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత కందెన్ సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మద అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి, తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది.

ఆతరువాత ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ వచ్చింది.ఈ టీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ఆమె స్టార్ డమ్ తెచ్చి పెట్టింది. జబర్దస్త్ తరువాత రేష్మి చాల ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేస్తుంది. ఈ మధ్య లో గుంటూరు టాకీస్ అనే చిత్రం కూడా చేసింది.ఆనతి కాలం లోనే తెలుగు తెర మీద పాపులర్ అయింది.