మొహాలీలో ఈనెల 19న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ హైదరాబాద్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. వరుసపెట్టి సిక్సర్లు బాదుతూ టీ20 ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌కు ముచ్చెమటలు పట్టించాడు.
తాజాగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో నాటి పరాభవానికి రషీద్ ఖాన్ ప్రతీకారం తీర్చుకున్నాడు. హైదరాబాద్ జట్టు కేవలం 132 పరుగులు మాత్రమే చేసినా పంజాబ్‌ను మట్టి కరిపించడంలో రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు వేసిన రషీద్ 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలర్ల దెబ్బకు పంజాబ్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 119 పరుగులకు ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. తాజా, మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.