//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపియల్ లో రషీద్ ఖాన్ ఎంత హిట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

Category : state

ఐపియల్ లో రషీద్ ఖాన్ ఎంత హిట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన రషీద్ ఖాన్ అంచనాలకు మించి రాణించాడు. అటు బ్యాట్ తో కూడా సత్తా చాటాడు. అయితే అతనిని రెండు జట్లు వద్దనుకున్నాయట.

ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ కోచ్ లాల చంద్ రాజపుత్ వివరించాడు. ఆప్ఘన్ జట్టుకు కోచింగ్‌ ఇస్తున్న సమయంలో రషీద్ ఖాన్ ఆటతీరును గమనించిన తాను ఐపీఎల్ ఫార్మాట్‌కు తగిన ఆటగాడిగా గుర్తించానని ఆయన చెప్పారు.

ఆరేడు నెలల తర్వాత తాను టీమిండియా ఆటగాళ్లను కొందరిని కలిసి రషీద్ ఖాన్‌ను జట్టులో చేర్చుకోవాల్సిందిగా కోరానని తెలిపారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టులోకి రషీద్ ఖాన్‌ను తీసుకోవాలని తాను సెహ్వాగ్‌ను కలిశానని, అయితే తమకు స్పిన్నర్ అక్సర్ పటేల్ ఉన్నాడని.. తమకు స్పిన్నర్లు అవసరం లేదని.. ఆల్‌రౌండర్లు కావాలని సెహ్వాగ్ చెప్పినట్లు లాల్ చంద్ వివరించారు.

కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్‌ను కలిసి రషీద్‌ను తీసుకోవాలని కోరగా.. తమకు సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లు ఉన్నారని గంభీర్ బదులిచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ లక్ష్మణ్‌ను కలవడం, రషీద్‌కు ఆడే అవకాశం దక్కడం.. అలా రషీద్ ఖాన్ హైదరాబాద్ తరపున ఆడటం.. ఇప్పుడు తనేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని లాల్ చంద్ చెప్పారు.