//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విచిత్రమైన కేసు ...నన్నెందుకు కన్నారని కోర్టుకెక్కిన యువకుడు

Category : national politics

ఎన్నో సమస్యల పైన కోర్టుకెక్కడం తెలుసు కానీ నా అనుమతి లేకుండా ఎలా జన్మనిస్తారని ప్రశ్నించడమే కాకుండా.. కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవ్వడం మీరు ఎక్కడైనా విన్నారా! పిల్లలను కని పెంచి.. ప్రయోజకులను చేస్తే తమకు గొప్ప పేరు వస్తుందని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. కానీ.. ఆ పిల్లలే పెరిగిన తర్వాత.. నన్ను ఎందుకు భూమి మీదకు తీసుకువచ్చావని కోర్టుకెక్కితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. ముంబైలోని ఓ కుటుంబానికి అలాంటి పరిస్థితే ఎదురైంది.

తన అనుమతి లేకుండా ఎందుకు జన్మనిచ్చారని తల్లిదండ్రులపై దావా వేసేందుకు సిద్దమయ్యాడు రాఫెల్‌ శామ్యూల్‌ అనే ఇరవై ఏడేళ్ల ప్రబుద్ధుడు. మానవజాతిపై నమ్మకం లేని ఈ ప్రబుద్దుడు.. పిల్లలు కనడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. పిల్లలను కనడం వల్ల వారు పెరిగి భూమిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. బిడ్డలకు జన్మనివ్వడం తప్పంటున్న శామ్యూల్‌.. పిల్లలను ఈ భూమి మీదకు బలవంతంగా తీసుకురావడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇది చాలా తప్పు అని అంటున్నాడు. అలాగే.. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినవన్నీ చేయాల్సిన పని లేదంటున్న శామ్యూల్‌.. కానీ ఎవరైనా నిజాయితీగానే మనిషికి గౌరవమివ్వాలంటాడు. తాను మాత్రం తల్లిదండ్రులను ప్రేమిస్తున్నానని.. తల్లిదండ్రులకు తనకు మధ్య మంచి అనుబంధమే ఉందంటున్నాడు. అయినా సరే, తల్లిదండ్రులు వారి ఆనందం కోసం మాత్రమే పిల్లలకు జన్మనిస్తారని చెబుతాడు.

తన జీవితం అద్భుతంగా ఉందంటున్న శామ్యూల్‌.. తన వల్ల మరొకరికి హానీ కలగడం ఇష్టం లేదని చెబుతున్నాడు. అంతేకాదు తనకు నిహిలాండ్‌ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌లో.. పిల్లలు ఈ ప్రపంచంలో ఎలా ఉండాలనే దానిపై ప్రసంగాలు పోస్ట్ చేస్తుంటాడు. పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ ఈ భూమిపై నేరాలు పెరుగుతూ ఉంటాయని అభిప్రాయపడుతున్నాడు. మొత్తానికి ఎన్నో కేసులను చూశాం కానీ తాజాగా శామ్యూల్‌ కేసు చాలా విచిత్రమైన కేసు. మరి కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరిస్తుందా. స్వీకరిస్తే ఎలాంటి తీర్పు వస్తుందన్నది మాత్రం ఆసక్తిని కలిగించే అంశమే.

Related News