//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మైనర్ పై అత్యాచారం .....శీలానికి వెలకట్టిన గ్రామపెద్దలు...!

Category : state

ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి . చట్టాలు , పోలీసులు ఎన్ని ఉన్న ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలని అరికట్టలేకపోతున్నారు . తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.

అసలు విషయం ఏమిటంటే ...నారాయణపేటలో17ఏళ్ల బాలిక వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రులకు సాయం చేస్తోంది. పత్తి పొలాల్లో పనిచేస్తున్న ఆ బాలికను పొలం యజమాని వెంకటయ్య పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గట్టిగా అడిగేసరికి మొత్తం చెప్పేసింది. తరువాత ఆస్పత్రికి తీసుకుని వెళ్తే ఆమె గర్భం దాల్చింది అని చెప్పారు.

న్యాయం కోసం పోరాడితే.. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెల కట్టారు. నిందితుడికి 2.5 లక్షల రూపాయల జరిమానా వేసి వదిలేశారు. జరిగిన 10 తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడితో పాటు నలుగురు పంచాయతీ పెద్దలను అరెస్టు చేశారు. ఈ ఐదుగురిని పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుకు వారికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు.