//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిరవ్ మోదీ తో నరేంద్ర మోదీ.. ఏం చేశారు..!

Category : politics

నీరవ్ మోడీ పరారీ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై పిఎంవోకు 2016 జులై 26వ తేదీననే ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు మండిపడింది.పిఎంవో గానీ ఇతర సంస్థలు గానీ చర్యలు తీసుకోలేదని,దీంతో నిందితుడు పారిపోయాడని కాంగ్రెసు నాయకులు అన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన 11,500 కోట్ల కుంభకోణం దేశంలో కలకలం రేపుతోంది.రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.

గతవారం వ్యాపారవేత్త నీరవ్ మోదీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.నీరవ్ మోదీ,ఆయన బంధువులు కలిసి 280 .7 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.బ్యాంకు సిబ్బంది సహాయంతోనే నీరవ్ మోదీ ఈ అక్రమాలకు పాల్పడినట్లు బ్యాంకు చెబుతోంది.పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ ఉదంతంపై ఫిర్యాదు చేసిన అనంతరం వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులపై అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.అందులో కాంగ్రెస్ తరఫున ప్రధానికి ఆయన 5 ప్రశ్నలు సంధించారు.

1. నీరవ్ మోదీ దావోస్‌లో ప్రధాన మంత్రి మోదీతో కలిసి ఏం చేస్తున్నారు.

2. ప్రధాని కళ్ల ముందే అంత పెద్ద బ్యాంకు లూటీకి గురైంది.దానికి ఎవరు బాధ్యులు.

3. ప్రధానికి ఈ విషయంపై గత జూలైలోనే సమాచారం అందింది.మరెందుకు ఎవరిపైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

4. మొత్తం వ్యవస్థంతా ఎలా మోసపోయింది.ప్రతి ఆడిటర్, ప్రతి అధికారి కళ్ల ముందు నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా దారిమళ్లాయి.దీన్ని బట్టి చూస్తే ఎవరో ఒక పెద్ద మనిషి అండ ఈ కుంభకోణం వెనక ఉందని అర్థమవుతోంది.మోదీజీ ఎవరా వ్యక్తి.

5. దేశానికి చెందిన మొత్తం బ్యాంకింగ్ రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ,మోసాల్ని అరికట్టే వ్యవస్థ అలా ఎలా విఫలమైంది మోదీజీ సమాధానం చెప్పండి.

కాంగ్రెసు ప్రధాని మోడీకి ఐదు ప్రశ్నలు వేసి వాటికి సమాధానం కావాలని డిమాండ్ చేసింది.

Related News