//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత ప్రేక్షకుల్లా చేయవద్దన్న రణతుంగ

Category : sports

తమ జట్టు ఓటమి అంచున ఉండడంతో అసహనంతో భారత జట్టును ఉద్దేశించి మైదానములు బాటిళ్లు విసిరిన శ్రీలంక ప్రేక్షకులను వారుస్తూనే భారత ప్రేక్షకుల వలే చేయీయవద్దంటూ శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఏకపక్షంగా శ్రీలంకలో విజయాలు సాధిస్తున్న భారత జట్టును ఒకింత కించపరిచే రీతిలో వ్యాఖ్యానించినట్లు స్పష్టం అవుతున్నది. 

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య ఆదివారం మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో శ్రీలంక అభిమానులు ఆగ్రహంతో మైదానంలోకి బాటిళ్లు విసరడంతో సుమారు 35 నిమిషాల పాటు అంపైర్లు ఆటను నిలిపివేశారు.

ఈ ఘటనపై  రణతుంగ స్పందిస్తూ "క్యాండీలో భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులు వాటర్‌ బాటిల్స్‌ విసిరి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. లంక అభిమానులు కాస్త ఓర్పుతో ఉండాలి. సంయమనం పాటించాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయవద్దు" అంటూ పేర్కొనడం హుందాగానే ఉంది.

పైగా "లంక ప్రజలు క్రికెట్‌ని ప్రేమిస్తారు. మేము మ్యాచ్‌ ఓడిపోయినప్పుడు వారెంతో బాధకు గురవుతారు. క్రికెట్‌ కోసం ఎన్నో వదులుకున్నాం. వరుస ఓటములతో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు" అంటూ సముదాయించే రీతిలో మాట్లాడారు. అయితే అంతటితో ఆగకుండా "ఈ సందర్భంగా క్రికెట్‌ అభిమానుల్ని ఒకటే కోరుతున్నాను. దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు. మనకంటూ మంచి చరిత్ర, సంస్కృతి ఉంది. ఇలాంటి ప్రవర్తనను మన చరిత్ర, సంస్కృతి ఒప్పుకోదు" అని రణతుంగ పేర్కొనడం పరోక్షంగా తమ దేశస్థులు ప్రదర్శించిన అసహనాన్ని సమర్ధించినట్లు కనిపిస్తున్నది.

 1996లో ప్రపంచకప్‌ సెమీస్‌లో ఈడెన్‌గార్డెన్‌లో భారత్‌-లంక జట్లు తలపడిన సమయంలో  భారత్‌ వరుస వికెట్లు కోల్పోతుండటంతో అభిమానులు వాటర్‌ బాటిల్స్‌ విసిరి, ప్లే కార్డులు తగలబెట్టి గొడవ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రణతంగ పైవిధంగా వ్యాఖ్యలు చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.