//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారీ బ‌డ్జెట్‌తో రాణా కొత్త‌ చిత్రం..!

Category : movies

రెగ్యుల‌ర్ హీరో క్యారెక్ట‌ర్‌కు రాణా ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు. హీరోయిజం చూపించాలనుకుంటే బాహుబ‌లి కోసం విల‌న్ అయ్యేవాడే కాదు. అయినా అయిదేళ్ల‌పాటు ఒకే చిత్రం కోసం ప‌నిచేసే వాడు కానే కాదు. తెలుగు సినిమా స్థాయిని పెంచాల‌ని కోరుకుంటున్నాడు రాణా. అందుకు త‌గ్గ‌ట్టే పెద్ద పెద్ద క‌ల‌లు కంటున్నాడు. 180 కోట్ల రూపాయ‌ల‌తో భారీ బ‌డ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. Rana New Movie with high budget

ప్ర‌స్తుతం అర‌ణ్యం అనే ట్రైలింగ్యువ‌ల్ మూవీ మూవీ చేస్తున్నాడు రాణా. ఈ ఏడాది చివ‌రికి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. సంక్రాంతికి గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో హిర‌ణ్య‌క‌శ్య‌ప చిత్రం ఘ‌నంగా ప్రారంభం కాబోతుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని దాదాపు రూ.180 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతుంది. తెలుగుతోపాటు త‌మిళ హిందీ భాష‌ల్లో కూడా తెర‌కెక్క‌నుంది.Rana New Movie with high budget

గ‌తంలో భ‌క్త ప్ర‌హాల చిత్రంలో హిర‌ణ్య క‌శ్య‌ప పాత్ర‌లో ఎస్వీఆర్ న‌టించారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఈ చిత్రం గొప్ప పౌరాణిక చిత్రంగా వెలుగొందుతోంది. గ‌త రెండేళ్లుగా ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. తెలుగు భాష‌పై అద్భుత‌మైన ప‌ట్టు ఉన్న రాణా హిర‌ణ్య క‌శ్య‌ప‌లో న‌ట విశ్వ‌రూపం చూసేందుకు రెడీ అవుతున్నాడు.Rana New Movie with high budget