//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దగ్గుపాటి రానా నిర్మాణం లో రిలీజ్ సిద్ధంగా ఉన్న మూవీ ఇదే....

Category : movies

సురేశ్‌ బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా రానా దగ్గుపాటి సమర్పిస్తున్న తాజా చిత్రం C /o కంచరపాలెం. వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్వీకర్‌ అగస్థి సంగీతం అందిస్తున్నారు. దగ్గుపాటి రానా మాట్లాడుతూ ‘మీ మొదటి ప్రేమని గుర్తు చేసి గిలిగింతలు పెట్టేలా ‘ ఈ సినిమా ఉంటందని అన్నారు. అదే విధంగా న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

కాగా రానా, ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబరు 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అన్నారు. ఇది ప్రతి ఒక్కరి తొలి ప్రేమను గుర్తు చేస్తుందని.. ప్రేమ అవధులు లేనిది, అభిప్రాయాలకు అందనిదని ట్వీట్‌ చేశారు.

ఈ సినిమా వైజాగ్‌ దగ్గరలో ఉన్న కంచెర‌పాలెం నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థ అని రానా అన్నారు . ఈ చిత్రాన్ని చుసిన రానా, సినిమా నచ్చడంతో తానే విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారట. ఈ చిత్రాన్ని నూతన నటీనటులతో తెరకెక్కించారు.