Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అట్టుడుగుతున్నపంజాబ్, హర్యానా...30 మంది మృతి.. హైకోర్టు ఆగ్రహం

Posted 5 months ago | Category : national

అత్యాచారం కేసులో పంచకుల సిబిఐ కోర్టు గుర్మీత్‌ రామ్ రహీమ్ సింగ్‌ను దోషిగా తేల్చడంతో పంజాబ్, హర్యానాలోని ఆయన అనుచరులు, మద్దతుదారులు దారుణమైన హింస‌కు పాల్పడి ఆస్తుల‌ను ధ్వంసం చేస్తూ, భయానక పరిస్థితులను సృష్టించారు. కనీసం 30 మంది మృతి చెందగా, 350 మందికి పైగా గాయాలకు గురయ్యారు. తీర్పు వెలువరించిన పంచకుల సిబిఐ కోర్టు వద్ద ఆయన అనుచరులు వాహనాలు తగలబెట్టారు. పొరుగు రాష్ట్రాలైన ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లలో సహితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వాటర్‌ కేనన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఘర్షణ చెలరేగి లాఠీఛార్జికి దారితీసింది. రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మీడియా ఓబీ వ్యాన్ల‌కు నిప్పుపెట్టారు.  సిర్సా సమీపంలోని గురుమీత్ ఆశ్రయం డేరా వద్ద మీడియా వారిని వెంటాడి మరి కొట్టారు.  ఈ హింసాకాండలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సుమారు 100కు పైగా వాహనాలను తగలబెట్టారు.

ఈ విధ్వంసకాండ పట్ల పంజాబ్, హర్యానా హై కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ధ్వంసమైన ఆస్తలు విలువను ఆ సంస్థ నుంచే వసూలు చేయాలని హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ధ్వంసమైన ఆస్తుల విలువను సంస్థ ఆస్తులను జప్తు చేసి మరీ వసూలు చేయాలని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.అటు పంజాబ్ లోనూ ఆయన అనుచరులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టారు. పెట్రోల్ బంకులు, బతిండా ప్రాంతంలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

ముందుజాగ్రత్తగా ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రైల్వే శాఖ రెండు రాష్ట్రాల్లో 486  రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. ఖాళీగా ఉన్న రైల్వే  కోచ్ లను, ఆర్ టి సి బస్సు లను పలు చోట్ల తగులబెట్టారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే