//single page style gallary page

Ramcharan says that Ismart Shankar movie is good

Category : movies

Click here to read this article in Telugu

'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ బాగుంది అని చెప్పిన రాంచరణ్

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పై కథానాయకుడు రామ్‌ చరణ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. పూరీ దర్శకత్వంలో రామ్‌ కథానాయకుడిగా వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'ను చూసిన చెర్రీ ఫేస్‌బుక్‌ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నారు. తనకి ఈ మూవీ ఏంతో నచ్చిందని తెలిపారు. 'రామ్‌, ఇతర నటీనటులు చాలా ఎనర్జిటిక్‌గా నటించారు. అన్నింటినీ ఒక్కచోటుకు చేర్చి, ఓ మంచి సినిమా తీసిన వ్యక్తి ఆయన' అని పోస్ట్‌ చేశారు. దీంతోపాటు రామ్‌, పూరీ ఫొటోను కూడా షేర్‌ చేశారు. దీనికి రామ్‌ ట్విటర్‌లో స్పందించారు. 'ధన్యవాదాలు సోదరా..' అని పోస్ట్‌ చేశారు.

పూరీ, చెర్రీ కాంబినేషన్‌లో 'చిరుత' వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ''ఇస్మార్ట్‌ శంకర్‌' విజయం అందుకున్నందుకు రామ్‌, పూరీ, ఛార్మిలకు శుభాకాంక్షలు తెలిపాడు రాంచరణ్. మీ పట్ల చాలా చాలా సంతోషంగా ఉంది' అని కూడా ట్వీట్‌ చేశారు. 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలతోపాటు బాక్సాఫీసు వద్ద కూడా విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.

Leading director Ram Charan lavished praise on veteran director Puri Jagannath . Cherry, who saw Ram's backstory ' Ismart Shankar ' under the direction of Puri, shared his view on the Facebook platform. He said that he loved the movie. “ Ram and other actors have been very energetic . He is a man who has put all things together and made a good movie. Ram and Puri also shared the photo. Ram responded on Twitter. " Thank you brother .."

Puri, Cherry Combination ' Cheetah ' Rancharan congratulated Ram, Puri and Charmi for the success of Ismart Shankar. I am very happy with you, ”he tweeted. 'Ismart Shankar' has received critical acclaim from critics and celebrities, as well as at the box office . The film has earned around Rs 48 crore worldwide in just four days, the film's production company said.