//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ఎన్టీఆర్‌తోపాటు స్పెష‌ల్ లుక్‌లో చ‌ర‌ణ్‌..!

Category : movies

త్రిబుల్ ఆర్ తాలూకు అఫీషియ‌ల్ అప్డేట్ రావ‌డం లేదు కానీ, అభిమానుల్లో మాత్రం దాని మీద ఎడ తెగ‌ని ఆస‌క్తి నెల‌కొని ఉంది. ఇద్ద‌రి హీరోల గెట‌ప్స్ ఎలా ఉంటాయి. వాళ్ల నేప‌థ్యం ఏమిటి..? అన్న ప్ర‌శ్న‌ల‌పై ఇట‌ప్పికే ప‌లు ర‌కాల చర్చ‌లు జ‌రిగిపోయాయి. స్వాతంత్య్రం రాక ముందు బ్యాక్ డ్రాప్ అన్న విష‌యం దాదాపు స్ప‌ష్ట‌మైన‌ట్టే. 


ఇక‌పోతే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్డేట్ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ త‌న పాత్ర కోసం ఏకంగా వంద కిలోల‌కు పైగా బ‌రువు పెర‌గ‌బోతున్నాడు. దానికి త‌గ్గ‌ట్టే షూటింగ్ ఓపెనింగ్ రోజుతోపాటు మొన్న బ‌య‌ట‌కు వ‌చ్చిన లీక్డ్ ఫోటోలో ఎన్టీఆర్ ఒళ్లు చేసిన‌ట్టు క‌నిపించ‌డం ఈ అనుమానాల‌కు దారి తీస్తోంది.



అర‌వింద స‌మేత వీర రాఘ‌వ కోసం ఒళ్లు హూనం చేసుకుని విదేశీ ట్రైన‌ర్ స‌హాయంతో ఆరు ప‌ల‌క‌ల దేహాన్ని సాధించిన తార‌క్ ఇంత త‌క్కువ గ్యాప్‌లోనే అంత బ‌రువు అంటే సాహ‌స‌మే. అస‌లు బ్యాక్ డ్రాప్ గురించే అంతు చిక్క‌క ఫ్యాన్స్ స‌త‌మ‌త‌మ‌వుతుంటే ఇప్పుడు ఈ వంద కిలోల న్యూస్ షాక్ ఇచ్చేదే. 


అయినా, రాజ‌మౌళి ఏదైనా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడే చెబుతాడు కాబ‌ట్టి వెయిట్ చేయ‌డం త‌ప్ప ఎవ‌రూ ఏం చేయ‌లేని ప‌రిస్థితి. విన‌య విధేయ రామ చివ‌రి పాట కోసం కొంత బ్రేక్ తీసుకోనున్న రామ్ చ‌ర‌ణ్ డిసెంబ‌ర్ 25న జ‌రిగే ఆడియో రిలీజ్‌లో పాల్గొనాల్సి ఉంది. త‌రువాత త్రిబుల్ ఆర్ కోసం తాను కూడా ఏదైనా స్పెష‌ల్ లుక్‌లోకి మారాల్సి ఉంటుందేమో జ‌క్క‌న్న చ‌ర‌ణ్‌ల‌కు మాత్ర‌మే తెలుసు. మొత్తానికి విడుద‌ల‌కు చాలా టైం ఉన్న‌ప్ప‌టికీ త్రిబుల్ ఆర్ ఇప్ప‌టి నుంచే హాట్ డిస్క‌ష‌న్‌లోకి వెళ్లిపోయింది. 

Related News