//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాంచరణ్ వల్లనే చలో..!

Category : movies

టాలీవుడ్ హీరో నాగ శౌర్య, రష్మిక లీడ్ రోల్స్ గా వెంకీ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఛలో. రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగ శౌర్య. ఇక ఇది తన ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి సినిమా అని తప్పకుండా విజయం సాధిస్తుందని అంటున్నాడు నాగ శౌర్య.

కొత్త డైరెక్టర్ వెంకీ చెప్పిన లైన్ నచ్చి ఇద్దరం కలిసి కథ ప్రిపేర్ చేశామని ఇక ఈ సినిమా టైటిల్ వెనుక రాం చరణ్ ప్రభావం ఉందని అంటున్నాడు. అదెలా అంటే సినిమా కథ అంతా సిద్ధం చేసి టైటిల్ ఏం పెడదామన్న ఆలోచన రాగా బ్రూస్ లీలో చరణ్ లే ఛలో పాట విన్నామని అది నచ్చి ఛలో అని పెట్టామని అంటున్నాడు నాగ శౌర్య.

తెలుగు, తమిళ బోర్డర్ లో రెండు ఊర్ళ మధ్య జరిగే కథే ఈ ఛలో. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవిని పిలిపించి సినిమాపై ప్రేక్షకుల కన్ను పడేలా చేసిన నా శౌర్య ఈ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకునేలానే ఉన్నాడు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు సాగర్ మహతి మ్యూజిక్ అందించడం మరో విశేషం. సినిమా ఫంక్షన్ కు చిరుని పిలవడమే కాదు. ఛలో టైటిల్ తో కూడా రాం చరణ్ కు సంబంధం ఉంది. యువ హీరోల్లో తన మార్క్ సినిమాలతో వెళ్తున్న నాగ శౌర్య మరి ఛలోతో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాల