//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప‌ట్టాలెక్క‌నున్న 'రామారావుగారు'

Category : movies

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి క్రిష్ ప్ర‌స్తుతం బాల‌య్య‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌ధ్య ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆ పాట‌లోని ఓ స్టిల్‌ను ర‌కుల్ పుట్టిన రోజు కానుక‌గా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కింద రిలీజ్ చేశారు.

జ‌న‌వ‌రిలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయి. ఆ వెంట‌నే బాల‌య్య‌తో సినిమా చేసేందుకు బోయ‌పాటి వీవీ వినాయ‌క్ లాంటి దర్శ‌కులు క్యూలో ఉన్నారు. కానీ, బాల‌కృష్ణ‌కు యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి చెప్పిన క‌థ బాగా న‌చ్చింద‌ట‌. రామారావుగారు టైటిల్‌తో తెర‌కెక్కే చిత్రం గురించి టాలీవుడ్ చాలాకాలంగా వింటూ వ‌స్తుంది. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్ల‌బోతుంద‌ట‌. వ‌చ్చే ఏడాది మార్చిలో షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.