Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రమాప్రభ !

Category : movies

సీనియర్ నటిగా,ఒక్కప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా గడిపిన రమాప్రభ ఈ మధ్య తన సినీ ప్రయాణానికి సంబంధించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా ఆమె జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన వ్యక్తితం గురించి కొన్ని సంచలమైన కామెంట్స్ చేయటం జరిగింది.ఆమె మాట్లాడుతూ నేను జూనియర్ ఎన్టీఆర్ ని మొదటి నుండి గమనిస్తూనే ఉన్నాను.అతనిలో పెరిగిన మెచ్యూరిటీ లెవెల్స్ చూసి నాకు ముచ్చటేస్తూ ఉంటుంది.ఆయన అతి చిన్న వయస్సులోనే సినిమాల్లో నటిస్తూ,సక్సెస్ అంటే ఏమిటో చూసాడు,కానీ అదే సమయంలో ఎన్టీఆర్ పక్కన వుండేవాళ్ళు అతనిని మిస్ గైడ్ చేశారు .నిజానికి ఎన్టీఆర్ లో వాళ్ళ తాతగారి లక్షణాలు చాలా ఉన్నాయి,సంస్కారం అనేది వాళ్ళ బ్లడ్ లోనే ఉంటుంది,కాకపోతే చిన్న వయస్సులో దానిని బ్యాలన్స్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాడు,

కానీ ఆ తర్వాత వెంటనే అశోక్ సినిమా టైం లో అతనిలో చాలా మార్పు కనిపించింది,అప్పటి నుండి ప్రతిసారి నేను ఆయన్ని గమనిస్తూనే ఉన్నాను.ఆయన మాటల్లో ఎంతో పరిణితి కనిపిస్తుంది,ఆ గొప్పదనం వాళ్ళ వంశంలోనే ఉంది,కాకపోతే ఎన్టీఆర్ లో అది బయటకు రావటానికి కొంచం టైం పట్టింది.కానీ నేడు ఎన్టీఆర్ మాట్లాడుతుంటే అందరం ఎదో తెలియని లోకంలోకి వెళ్ళిపోతాం,కొన్ని కొన్ని విషయాలకి ఆయన స్పందించే విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యపోవలసి వస్తుంది.నిజంగా ఎన్టీఆర్ బాబు గొప్ప వ్యక్తి. మొదటిలో ఉన్న గర్వం అనేది ఎంత త్వరగా వచ్చిందో,దానిని అంతే త్వరగా తగ్గించుకొని ఇప్పుడు శిఖర స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ చెప్పింది రమాప్రభ

Related News