//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జూనియర్ ఎన్టీఆర్ కలవాలనిపించింది

Category : movies

జూనియర్ ఎన్టీఆర్‌పై సీనియర్ నటి రమాప్రభ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ వెబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...."ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ బాబు దగ్గర ఒకటి గమనించాను. చాలా పరిణతితో, తాత్వికతతో.. కనిపిస్తున్నాడు. ముఖంలో రెండేళ్ల కిందటికీ.. ఇప్పటికీ 30 ఏళ్ల తేడా కనిపిస్తోంది. ఎందుకో కలవాలనిపించింది. అలా ఉంటే ఇష్టం. కలవాలని ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రకృతే కలిపిస్తుంది. మధ్యవర్తి ఉండకూడదు. ప్రకృతి సంబంధిత విషయాలకు మధ్యవర్తి అవసరం లేదు. శూన్యమని ఒకటి అంటారు. వైబ్రేషన్ కలిపిస్తుంది. అది నా నమ్మకం. దేవుడి భజనలు, పూజలు గుడులు, నాకు సరిపోవండి. అది జరగడానికి దేవుడు, స్వామి.. అవ్వక్కర్లేదు. మన సంకల్పం పాజిటీవ్‌గా ఉంటే అది జరుగుతుంది.. జరిగి తీరుతుంది" అన్నారు.