//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీరెడ్డి లీక్స్‌.. మొద‌లైన‌ రామ్ గోపాల్ వ‌ర్మర‌చ్చ‌..!

Category : movies

తాజా సెన్షేష‌న్ శ్రీరెడ్డి పోరాటంతో మా అసోసియేషన్ ఓ మెట్టు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం టాలీవుడ్‌లో సెగలు పుట్టిస్తోంది. మా అసోసియేషన్ దిగివచ్చిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. శ్రీరెడ్డికి అనూహ్యంగా విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల మద్దత్తు లభించిన సంగతి తెలిసిందే. సంచలన లీకులతో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి... కొందరు ప్రముఖల పేర్లని శ్రీరెడ్డి బయట పెడుతుండడంతో ఇప్పుడు అంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఏకంగా ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. ఇప్పుడు ఆమెతో చాలా మంది గొంతు కలుపుతున్నారు. అయితే తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి శ్రీరెడ్డిపై స్పదించారు. శ్రీరెడ్డి ఝాన్సీ లక్ష్మీబాయ్‌లా పోరాడారని ఇటీవల ట్వీట్‌ చేసిన వర్మ.. మ‌రోసారి ఆమెను ఉద్దేశించి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు. శ్రీరెడ్డి నిజాయతీని ఎదుర్కొనలేక కొందరు పురుషులు వణికిపోతున్నారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మహిళలంతా ఆమె పై అసూయపడుతున్న వారే. నిజంగా నిజాయతీ ఉన్న మహిళలు మాత్రమే శ్రీ స్త్రీ శక్తికి మద్దతుగా ఉంటారని ట్వీట్ చేశారు వర్మ.