//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ దమ్ము నాకే ఉందని ఆర్జీవీ స్పీచ్... అప్సరసలకు ఎన్టీఆర్ ద్రోహం చేసాడు ....

Category : movies

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితంపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. జనవరి 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో తాను ఏం చూపించబోతున్నారో వెల్లడించారు. అంతే కాదు ఎన్టీఆర్ అంటే తనకు ఎంత ఇష్టమో వివరించే ప్రయత్నం చేశారు.

ఎన్టీఆర్ గారిలో నేను చూసిన విపరీతమైన డిఫరెన్స్ ఏమిటంటే.. ప్రతి ప్రజానాయకుడు ఎన్టీఆర్ కాలం నుంచి నుంచి ఇప్పటి వరకు దండాలు పెట్టి ఓట్లు అడుగుతారు. ఎన్టీఆర్ గారు ఒక్కరే రేయ్ అని ఓట్లేయమన్నారు. ఆ పొగరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మనసులో ఉన్న నిజాయితీలో నుంచి వచ్చింది. ఓట్లు దేవురించి అడుక్కోవాల్సిన అవసరం లేదని తెలుసు కాబట్టి ఆయన అలా చేశారు. దానికి నేను అట్రాక్ట్ అయ్యాను అని వర్మ తెలిపారు.

ఒక మనిషిగా ఆయనకున్న వ్యక్తిత్వం కానీ, కాన్ఫిడన్స్ కానీ, నమ్మిన దానికి ఏమాత్రం జంకకుండా అందరి ముందు చెప్పే నిజాయితీ ఉండటం కూడా ఆయనలో నాకు ఎంతో నచ్చిన అంశం. లక్ష్మిపార్వతిగారి విషయానికొస్తే.... ఎన్టీఆర్ గారు శ్రీదేవిని, జయసుధను, జయప్రదను వదిలేసి ఈవిడను ఎక్కడ పట్టుకున్నారు అనిపించింది. అంత అందమైన అప్సరసలను వదిలేసి వాళ్లకు ద్రోహం చేసి లక్ష్మిపార్వతిగారిని పెళ్లి చేసుకోవడంతో పెద్ద సందిగ్ధంలో పడిపోయాను అని వర్మ వ్యాఖ్యానించారు.

ఆ సమయంలో లక్ష్మి పార్వతి అనే మహిళ డబ్బున్నావిడేమో? డబ్బుకోసం ఈ పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నాను... ఎన్టీఆర్ గారు అలా చేయరని తెలుసు కానీ నా మనసులో అలా అనిపించింది. వీరి పెళ్లి జరుగడానికి ఎలాంటి కారణం ఉంటుందో అనేది నా ఊహకు అందలేదు. దాని తర్వాత చాలా విషయాలు జరిగాయి. ఓ సందర్భంలో కాంట్రవర్సల్ ఆస్పెట్స్ వచ్చే సయమానికి లక్ష్మిపార్వతి మీద కొన్ని నెగెటివ్‌ వార్తలు వినడం, నెగెటివ్ ఇన్సిడెంట్స్ చూడటం, వేరే వేరే అభిప్రాయాలు కొందరి ద్వారా వినడం జరిగింది. అందులో నిజం ఉందా? లేదా? చెప్పేవారు ఏ ఎజెండాతో చెబుతున్నారనే దానిపై అపుడు నాకు క్లారిటీ లేదు.కానీ ఎప్పుడైతే లక్ష్మిపార్వతి కోణంలో ఎన్టీఆర్ గారి మీద సినిమా తీయాలనుకున్నపుడు చాలా సీరియస్ గా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అన్ని సంవత్సరాల క్రితం ఏం వినడం జరిగిందో మళ్లీ అతే వినడం జరిగింది. నిజం ఏమిటి? అని సందిగ్ధంలో పడిన సమయంలో నాకు ఒక ప్రత్యక్ష సాక్షి దొరికాడు. అతడి పేరు ఎన్టీ రామారావు. ఆయన నా కలలోకి రాలేదు. ఆయన వీడియో ఒకటి యూట్యూబ్ లో చూశాను. ఆయన పోయే కొన్ని రోజుల ముందు లక్ష్మి పార్వతి గారి గురించి ఎనలేని గౌరవంతో మాట్లాడం చూశాను. అది చూసిన తర్వాత ఆయనకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదనిపించింది.

ఈ సినిమాలో రాజకీయ ఉద్దేశ్యం లేదు. ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డిని కలిసే సమయంలో అతడు ఎవరో ఏ పార్టీకి చెందినవారో నాకు తెలియదు. అయితే అతడు వైసీపీ నేత కావడంతో ఈ సినిమా వెనక ఆ పార్టీ ఉందని కొందరంటున్నారు. వాస్తవానికి మీ శత్రువు మీ గురించి చెబుతుంటే అవతలి వాళ్లు నమ్మరు. ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ప్రలోభానికి గురయ్యారనేది ఎంత తప్పో వైసీపీ నన్ను వాడుకుని రాజకీయ లబ్ది కోసం ఈ సినిమా చేయిస్తుంది అనేది అంతే తప్పు అని వర్మ స్పస్టం చేశారు.నేను మహానాస్తికున్ని అని అందరికీ తెలుసు. జీవితంలో దేవిడి పూజ చేయలేదు.

అయన నోటి వెంట విన్న చాలా విషయాలని నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. తరువాత నేను ఎంతవరకు అన్వయించుకుంటాను లక్ష్మి పార్వతి గారిని ఎంత వరకు పాజిటివ్ గా చూపెడతాను అనేది సినిమాలో చూస్తారు.... అని వర్మ స్పష్టం చేశారు.