//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Category : politics

వివాదాలకు అతి దగ్గర ఉండే రామ్ గోపాల్ వర్మ జిఎస్టి మూవీ విషయం లో మరో సారి వార్తల్లో కి ఎక్కారు.జిఎస్టి మూవీ ప్రమోషన్ లో భాగం గా ఓ మీడియా ఛానల్ లో మాట్లాడుతూ ఓ మహిళతో నీతో కూడా పోర్న్ మూవీ తీస్తాను అని కామెంట్ చేసాడు.

దాన్ని సీరియస్ గా తీసుకున్న దేవి అనే మహిళా నేత వర్మ ఫై కేసు పెట్టింది.ఆ కేసు విచారణ లో భాగం గా నిన్న అయన సిసిఎస్ పోలీసులు ముందు హాజరయ్యారు.విచారించిన అనంతరం ఆయనకు మళ్ళీ ఒక సారి రావాలని నోటీసులు జారీ చేసారు.

ఎప్పుడు ట్విటర్ యాక్టీవ్ గా ఉండే వర్మ ఈ రోజు ఉదయం ఏపీ రాజకీయాల గురించి ట్విట్ చేసాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ అద్భుతంగా రాణిస్తారని తాను నిజంగా నమ్ముతున్నట్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు.

ఈ మేరకు వర్మ నేడు తన ట్విట్టర్ ఖాతాలో రెండు పోస్టులు పెట్టారు. ఎన్నికల్లో తెలుగు ప్రజలకు దారిచూపే దీపంగా పవన్ మారుతారని అభిప్రాయపడ్డాడు. నిజం చెబితే, ప్రతి ఒక్కరూ బాధపడతారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని ఎంచుకోవాలో ఏపీ ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

Related News