//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ ఏడుస్తూ "జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’'..... లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

Category : movies

సంచలన దర్శకుడు ఆర్జీవీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. సినిమా విడుదలకు ముందే వివాదాలకు,విమర్శలకు నెలవైంది.లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ నేడు రిలీజ్‌ అయింది. ఇందులో ‘1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి’.. అంటూ ఓ కొటేష‌న్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌, ల‌క్ష్మీ పార్వ‌తి మ‌ధ్య ఎమోష‌న‌ల్ సీన్స్. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు "జీవితం.. ఎప్పుడు.. ఎందుకు.. ఎలా.. మలుపు తిరుగుతుందో ఎవ్వరికి అర్థం కాదు అని ఎన్టీఆర్ అన‌డం".. త‌న ఫ్యామిలీ వేరే వారిని న‌మ్మ‌డం.. జీవితంలో చేసిన ఒకే ఒక్క త‌ప్పు వాడిని న‌మ్మ‌డం అని ఎన్టీఆర్ చెప్ప‌డం.. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టడం.. ల‌క్ష్మీ పార్వతికి తాళి క‌ట్ట‌డం లాంటి సన్నివేశాల‌ని ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్‌ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ముగుస్తుంది. అనే విషయాలను ట్రైలర్‌లో స్పష్టంగా చూపించాడు వర్మ. ఇక ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన నిమిషాల్లోనే దాదాపు లక్షల వ్యూస్‌ రావడం విశేషం.

ఆద్యంతం ఆస‌క్తికరంగా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై ఎన్నో అంచ‌నాలు పెంచుతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కృతజ్ఞతలేని, అవిశ్వాసవంతమైన కుటుంబసభ్యులు, వెన్నుపోటు పొడిచి మోసం చేసిన వాళ్ల కథల కలయిక అని ఇప్ప‌టికే వ‌ర్మ ప్ర‌క‌టించ‌గా చిత్రానికి సంబంధించిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేయ‌నున్నారు.

చిత్రంలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు.

Related News