Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రామ్ గోపాల్ వర్మ ‘గన్స్ అండ్ థైస్’ ట్రైలర్......

Category : national movies

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ వివాదం ఆ వివాదంలోనే సంచలనం ఉంటుంది. ఆయన సినిమాలకు ప్రమోషన్స్ అవసరం లేదు అతగాడి వివాదాలే ప్రీ ప్రమోషన్స్. ట్విట్టర్ వేదికగా ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనానికి సోషల్ మీడియానే వేదిక చేసుకున్నారు.తాజాగా ‘నా ట్విట్టర్ ఫాలోవర్స్‌కు ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నా అంటూ ఉదయం ట్వీట్ చేసిన వర్మ అన్నట్టుగానే ట్విట్టర్‌లో బాంబ్ పేల్చారు.

ముంబై మాఫియా నేపథ్యంలో ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ పేరుతో ఓ ట్రైలర్‌ను వదిలి అందర్నీ ఆశ్యర్యపరిచాడు. అయితే తాజా ట్రైలర్‌లో వర్మ సినిమాల్లో ఇంతకు ముందు కనిపించని సెక్స్ సీన్లు ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. హీరోయిన్ ఒంటిపై నూలు పోగు లేకుండా పూర్తి నగ్నంగా చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు వర్మ.అంతేకాదు ‘గన్స్ అండ్ థైన్’ ట్రైలర్‌లో క్రైమ్ సీన్లు ఒక రేంజిలో ఉన్నాయి. తన సినిమాల్లో చూపించలేని భయంకరమైన హింసను ఈ ట్రైలర్‌లో చూపించాడు. గతంలో ముంబై మాఫియాకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించాలని ఆ సన్నివేశాలను రియలిస్టిక్‌గా చిత్రీకరించాలని ప్రయత్నించినా కుదరలేదని.. తాజాగా ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌లో వాటిని ప్రజంట్ చేస్తున్నట్లు వర్మ తెలిపారు.మరి వర్మ లేటెస్ట్ ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ ట్రైలర్ ఈ రేంజ్‌లో ఉంటే ఇక సిరీస్ మొత్తం ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.

Related News