//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయలు బహుమానం

Category : movies

ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని దసరా రోజు ప్రారంభిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో చెప్పాడు. ఈ నెల 19న ఈ చిత్రానికి సంబందించిన వివరాలను వెల్లడిస్తానని, అదే విధంగా ఈ సినిమాని జనవరి నెలాఖరులో లో విడుదల చేస్తానని అయన అన్నాడు.

ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలుగు ప్రజలకు షాక్ ఇచ్చాడు. ఆ వీడియోలో ఒక మనిషి నిక్కర్, బనియన్ వేసుకుని హోటల్ లో పని చేస్తున్నాడు.

ఆ వీడియో చుసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయన అచ్చం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పోలి ఉన్నాడు. వెంటనే రామ్ గోపాల్ వర్మ ఈ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తానంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే మెయిల్ చేయండి అంటూ Laksmisntr@gmail.com ఐడీ ని ఇచ్చాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ఆ వ్యక్త్తితో చంద్రబాబు పాత్రను చేయించాలని రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నాడని, అందుకే లక్ష రూపాయలను బహుమతి ప్రకటించడాన్ని తెలుస్తుంది.