//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దక్షిణాది టాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తానంటున్న రామ్ చరణ్ తేజ్....!

Category : movies

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మెగా స్టార్ తనయుడిగా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ అతి తక్కువ సమయం లోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.తాజగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుని నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించాడు.ఇక రంగస్థలం సినిమాతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన రామ్ చరణ్.ఈ సినిమా తరువాత మరో భారీ బడ్జెట్ ఆక్షన్ సినిమా గా తెరకెక్కిన వినయ విధేయ రామా తో మారో మారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

అయినప్పటికీ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఫ్లాప్ అయిన కూడా 70 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరినీ ఆశ్ఛర్యానికి గురిచేసింది.ఇక మన టాలీవుడ్ లో హిట్ కి ఫ్లాప్ కి సంబంధం లేకుండా ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించాయి.ఈ లెక్కన రామ్ చరణ్ రీసెంట్ సినిమా వినయ విధేయ రామ 50 కోట్ల వసూళ్లతో 30 కోట్ల గ్రాస్ తో దాదాపు 80 కోట్ల రూపాయలు వసూలు చేసి టాలీవుడ్ లో రామ్ చరణ్ కి ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉందో నిరూపించింది.... ఇదిలా ఉండగా రామ్ చరణ్ త్వరలో కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సౌత్ ఇండియాలో రాజమౌళి తో సమానమైన క్రేజ్ ఉన్న ఏకైక దర్శకుడు శంకర్.అలాంటి దర్శకుడి తో రామ్ చరణ్ సినిమా అనగానే అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

శంకర్ తో సినిమా అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి హీరో కూడా ఆయన దర్శకత్వంలో నటించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.కానీ ఆయన ఇప్పటి వరకు ఏ నార్త్ హీరో తో ఇప్పటవరకూ ఫుల్ లెంగ్త్ మూవీ చేయలేదు.అయితే కొన్ని వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ చిత్రం ఇప్పటికే ఫైనల్ అయ్యినట్టు ఈ సినిమా స్టోరీ లైన్ కూడా రామ్ చరణ్ విన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్ కమలహాసన్ తో భారతీయుడు -2 సినిమా చేయబోతున్నారు .ఈ సినిమా తరువాత బాలీవుడ్ ఆక్షన్ హీరో హృతిక్ రోషన్ తో ఓ సినిమా, రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి శంకర్ రంగం సిద్దం చేసుకున్నారు. ప్రస్తుతానికి రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్. ఆర్.ఆర్ లో నటిస్తున్నారు.