//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రామ్ చ‌ర‌ణ్‌, బోయ‌పాటి మూవీ టైటిల్ లీక్‌..!

Category : movies

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న అప్ క‌మింగ్ సెన్షేష‌న్ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే.

భారీ అంచ‌నాల న‌డుమ వ‌స్తున్న ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను అమాంతం పెంచే విధంగా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ ఉంటుంద‌ని అంతా భావించ‌గా, ఫ‌స్ట్ లుక్ గురించి తెలీదు కానీ, సినిమా టైటిల్ మాత్రం రాజ‌వంశ‌స్థుడు కానీ, రాజ‌మార్తాండ కానీ, జ‌గ‌దేక‌వీరుడు కానీ ఇలా ఈ మూడింటిలో ఏదో ఒక‌టి ఉంటుంద‌ని మెగా అభిమానులంతా డిసైడ్ అవుతున్న స‌మ‌యంలో ఎవ్వ‌రి ఊహ‌లకు అంద‌ని ఇధంగా ఒక డిఫ‌రెంట్ టైటిల్‌తో బోయ‌పాటి శ్రీ‌ను మెగా అభిమానుల‌కు షాక్ ఇచ్చాడ‌నే చెప్పాలి.

రీసెంట్‌గా జయ జాన‌కి నాయ‌క అంటూ డిఫ‌రెంట్ టైటిల్‌ను ట్రై చేసిన బోయ‌పాటి శ్రీ‌ను ఈ సినిమా విష‌యంలోనూ అలాంటి ఫార్మేట్‌నే ఫాలో అవుతున్న‌ట్టు స‌మాచారం. ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం, ఈ సినిమా టైటిల్ విన‌య విధేయ‌ రామ అనేట‌టువంటి డిఫ‌రెంట్ టైటిల్‌ను అనుకుంటున్నార‌నే టాక్ గ‌ట్టిగా వినిపిస్తుంది. ఇదే టైటిల్‌తో అక్టోబ‌ర్ 18న ద‌స‌రా కానుక‌గా సినిమా అఫిషియ‌ల్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలి అంటే ఈ ద‌స‌రాకు విడుద‌ల కానున్న సినిమా అఫిషియ‌ల్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేంత వ‌ర‌కు ఆగాల్సిందే.