సాధారణంగా సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల మధ్య వుండే పోటీ తరచుగా ఉంటుంది కానీ మిడ్ రేంజ్ హీరోలు పోటీ పడుతోంటే మాత్రం ఓవర్ లుక్ అవుతుంది. కానీ సరిగ్గా గమనిస్తే స్టార్ హీరోల కంటే ఓ మధ్య శ్రేణి యువ హీరోల మధ్యే ఆసక్తికరమైన పోటీ జరుగుతూ వుంటుంది.
రామ్,నితిన్ ఇద్దరూ తరచుగా ఒకే సినిమాలు, దర్శకుల కోసం పోటీ పడుతుంటారు. ఇద్దరికీ సొంత బ్యానర్లు వుండడంతో దర్శకులు కూడా వీరికి త్వరగా ఎట్రాక్ట్ అవుతారు.
నితిన్ చేద్దామని అనుకున్న సినిమాని రామ్ చేసేయడం, రామ్‌తో టచ్ లో వున్న దర్శకుడిని పిలిపించి నితిన్ అడ్వాన్స్ ఇవ్వడం చాలా సార్లు జరిగింది. అయితే ప్రస్తుతం ఇద్దరి కెరియర్లు ఏమంత గొప్పగా సాగడం లేదనుకోండి. కాకపోతే తాజాగా ఈ ఇద్దరూ ఒకే దర్శకుడికి గాలం వేయడం జరిగింది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో సినిమా చేద్దామని ఇద్దరూ ప్రయత్నించారు.
అతని పెళ్లికి ఇద్దరూ విడివిడిగా వెళ్లి శుభాకాంక్షలు అందించి వచ్చారు. ప్రస్తుతం భూపతి చూపు రామ్ మీదే వుందని సమాచారం. ఇంకా ఫైనలైజ్ అవ్వకపోయినా నితిన్‌ని అయితే వెయిటింగ్లో పెట్టేసి రామ్‌తో సినిమాకి ఓకే చెప్పాడని టాక్ వుంది. కాకపోతే రామ్‌తో సినిమా అంటే మొదలయ్యే వరకు నమ్మడానికి వుండదు. చాలా మంది దర్శకులతో సినిమా చేస్తానని మాట ఇచ్చి తర్వాత డ్రాప్ అయిపోతూ వుంటాడు కాబట్టి నితిన్ ఇంకా అజయ్ భూపతిపై హోప్స్ వదులుకుని వుండడు.