//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ లో లోకల్ డిమాండ్ .. ఢిల్లీ లో నాగర్ కర్నూల్ లోకల్ టికెట్ కోసం ర్యాలీ

Category : politics state

లోక్ సభ ఎన్నిక‌ల‌ మోగింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రచారపర్వంలో దూసుకుపోతుంటే తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా టికెట్ల పంచాయితీ ఓ కొలిక్కి రాలేదు.రిజర్వుడ్ పార్లమెంటు స్థానం అయిన నాగర్ కర్నూల్ లో టికెట్ల పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఇప్పటివరకు అందరూ స్థానికేతరులకు టిక్కెట్ కేటాయించారని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అయినా స్థానికులకు టికెట్ కేటాయించాలని డిమాండ్ ఊపందుకుంది. ఒక‌వైపు పార్లమెంట్‌ ఎన్నికల‌ అభ్యర్థుల కోసం హైక‌మాండ్ క‌స‌ర‌త్తు చేస్తుంటే మ‌రోవైపు నేత‌లు లోక‌ల్ కుంప‌టిని రాజేస్తున్నారు. ముఖ్యంగా రిజ‌ర్వుడ్ పార్లమెంట్ స్థానమైన నాగ‌ర్ క‌ర్నూల్ నుండి లోకల్ అభ్యర్థులకే అవకాశమివ్వాలని రగడ మొదలైంది.

ప్రస్తుతం ఈ రగడ ఢిల్లీ వరకు చేరింది .నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ను స్థానికులకు ఇవ్వాలని అక్కడ పార్టీ నేతలు ఢిల్లీలో గళమెత్తారు. ర్యాలీగా వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక అసలు విషయానికొస్తే ఇప్పటి వ‌ర‌కు నాగ‌ర్ క‌ర్నూల్‌లో ఎంపీలుగా కాంగ్రెస్ నాన్ లోక‌ల్‌కు చెందిన వ్యక్తులే ఉన్నారు. మ‌ల్లు అనంత‌రాములు, మ‌ల్లు ర‌వి,మంద జ‌గ‌న్నాథం, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య అంద‌రూ కూడా స్థానికేత‌రులే. అయితే ప్రస్తుతం పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సంప‌త్, పీసీసీ అధికార ప్రతినిధి స‌తీష్ మాదిగ ఇద్దరు మాత్రం స్థానికులు. కనుక లోకల్ నేతలకే టికెట్ కేటాయించాలని గాందీభ‌వ‌న్ ముందు ధర్నా చేశారు కార్యకర్తలు.

ఇక ఇప్పుడు హస్తిన వేదికగా తమ గళాన్ని వినిపించారు. ర్యాలీగా వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు నాగర్ కర్నూల్ నేతలు. టిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ టికెట్ ను స్థానికుడైన, మాదిగ సామాజిక వర్గం నేతకు ఇవ్వడమే ఈ లోకల్ పంచాయతీకి అసలు కారణం. కాంగ్రెస్ పార్టీలో సైతం లోకల్ కే టికెట్ కేటాయిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అందుకే హస్తినలోని హైకమాండ్ కు తమ డిమాండ్ తెలియాలని ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. దీనిపైన హైకమాండ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. మరి నాగర్ కర్నూల్ టికెట్ లోకల్ నేతకా ... లేకా మళ్లీ నాన్ లోకల్ కా అన్నది త్వరలోనే తెలియనుంది.