//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ర్యాలీ ఫర్ రివర్ కి చిరు ఫ్యామిలి మద్దతి

Category : national

ప్రముఖ దార్శనిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ర్యాలీ ఫర్ రివర్ అనే కార్యక్రమానికి చిరంజీవి కూడా తన మద్దతు ప్రకటించారు. దేశంలోని నదీ జలాల సంరక్షణ కోసం ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమాన్ని సద్గురు ప్రారంభించారు. కాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ని చిరంజీవి కుటుంబ సభ్యులు కలిశారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు, రామ్ చరణ్- ఉపాసన దంపతులు , అల్లు అరవింద్ ఫ్యామిలీ, అపోలో గ్రూపు కి చెందినా ఫ్యామిలీ సభ్యులు అందరూ జగ్గీ వాసుదేవ్ ని కలిపి ఆత్మీయ సన్మానం చేశారు. కాగా ఇప్పటికే చిరంజీవి ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమం లో పాల్గొనమ మని 80009 80009 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని చిరంజీవి ఓ వీడియో మెసేజ్ ద్వారా ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.. నదులను కాపాడుకొని భావి తరాలకు నీరుని అందించాలని ఇందుకు ప్రజలందరూ చేతులు కలపాలని కోరుతూ చిరు మనవాళికి పిలుపు నిచ్చారు.

Related News