//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేను చేయాల్సింది ఇంకా ఉంది అంటున్న రకుల్ .......!

Category : movies

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ,మొదట వేంకటాద్రి ఎక్సప్రెస్ తో టాలీవుడ్ కి పరిచయమైంది . ఆనతి కలం లోనే తనలోని నటనని బయట పెడుతూ టాప్ ప్లేస్ లోకి దూసుకుపోయింది .

ఇప్పటికే దాదాపుగా టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో జతకట్టింది .నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ప్రతి సినిమా ద్వారా నేర్చుకున్న అనుభవాలతో వృత్తితో పాటు, వ్యక్తిగత జీవితాన్నీ మెరుగు పరుచుకున్న అని చెప్పింది .

తొలి రోజులకీ, ప్రస్తుతానికీ చాలా మారిపోయాను. మార్పు మంచిదే. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నామంటే నా దృష్టిలో ఏదో తప్పు జరుగుతున్నట్టే.

మానసికంగా ఎప్పుడూ ధృఢమే కానీ వృత్తి పరమైన కొన్ని విషయాల్లో ఓ రకమైన భయం, బెరుకు ఉండేది. పరిస్థితులకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాల్ని మార్చుకొంటూ ప్రయాణం చేయడం అవసరం. అనుభవం పెరిగేకొద్దీ నటన పరంగా నేను చేయాల్సింది చాలా ఉందనే విషయం తెలుసుకున్న అని చెప్పింది .

#RakulPreetSingh #tollywood #Latesttelugunews #Tollywoodltestupdates