//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ ' బయోపిక్ ' లో చిందులేయనున్న రకుల్ ...!

Category : movies

కెరటం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యి వరసగా వెంకటాద్రి ఎక్సప్రెస్ , రఫ్ లౌక్యం , కరెంటు తీగ ఇలా వరస సినిమాలతో బిజీ అయిన అందాల భామ రకుల్. అయితే తాజా గా రకుల్ మరొక భారీ చిత్రానికి ఛాన్స్ కొట్టేసింది.

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా .. బసవతారకం పాత్రను విద్యాబాలన్ చేస్తున్నారు.

ఇక మోహన్ బాబు .. రానా కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను చేస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాట కోసం దర్శకుడు క్రిష్ .. రకుల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ .. హిందీ సినిమాలతో రకుల్ బిజీగా వుంది. అయినా ఈ ప్రాజెక్టుకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ ప్రత్యేకమైన పాటలో మెరవడానికి అంగీకరించిందని అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యేక గీతాలు కూడా బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే.